Tamannaah Bhatia Jee Karda.. ఓటీటీ బొమ్మ అంటే.. బూతులు మాత్రమే.! ఔను, ఈ అభిప్రాయం చాలామందిలో వుంది. దాన్ని నిజం చేయడానికి ఫేమ్ వున్న నటీనటులూ కష్టపడుతుంటారు.
తమన్నాకి ఏమొచ్చింది.? ‘జీ కర్దా’ అనే వెబ్ సిరీస్‌లో అంత ఛండాలంగా చేయాల్సిన అవసరమేమొచ్చింది.?
ఏం.. ఎందుకు చేయకూడదు.? అన్న ప్రశ్నకీ సమాధానం వుండదు. నటన అన్నాక.. అన్నీ చేయాలేమో.!
Tamannaah Bhatia Jee Karda.. అదంతే.. అలా జరిగిపోతుందంతే.!
‘జీ కర్దా’ వెబ్ సిరీస్‌లో తమన్నా (Tamannaah Bhatia) నటించింది కాబట్టి.. ఓసారి అలా లుక్కేద్దామనుకుంటే, అందులోని ఓ సీన్ పెద్ద షాకే ఇచ్చింది.
‘ఛీ.. ఇలాక్కూడా చిత్రీకరిస్తారా సన్నివేశాల్ని.?’ అనిపిస్తుంది.! ఏమో, ఆ సమయంలో అలాక్కూడా మాట్లాడుకుంటారేమో.!

మాట్లాడుకుంటే మాత్రం, వెబ్ సిరీస్‌లో అలా చూపిస్తారా.? ఏం, ఎందుకు చూపించకూడదు.. మళ్ళీ అదే ప్రశ్న.
స్థాయి అనేదొకటి ఏడుస్తుంది కదా.!
పాపులారిటీ వచ్చాక.. కాస్తంత స్థాయి గుర్తెరిగి వ్యవహరించాలి కదా.? ఆ సోయ వుంటే, దీపికా పడుకొనే ఎందుకు ‘గెహ్రాయియేన్’ వెబ్ సిరీస్ చేస్తుంది.!
సహజత్వం కోసమంటూ ఓ వెకిలి వాదనని ‘ఓటీటీ’ కంటెంట్ విషయంలో వినిపిస్తుంటారు. సహజత్వమంటే అదా.?
Also Read: Mirnalini Ravi.. పద్ధతిగా చీర కట్టేసి.. కిటికీల జాకెట్టేసి.!
ఛండాలం.! జుగుప్సాకరం.! అత్యంత హేయం.! కాసుల కక్కుర్తిలో విషయం అర్థం కావట్లేదుగానీ.. తమన్నా, ఈ ఛండాలాన్ని కెరీర్‌కి పూసుకోవడం అస్సలేమాత్రం సమర్థనీయం కాదు.