Tamannaah Bhatia Shiva Shakti.. మిల్కీ బ్యూటీ తమన్నాలో, శివ శక్తిని ఎలా చూడగలిగారన్నది ఓ ప్రశ్న.! అదీ, దర్శకుడికి.! ఆ ప్రశ్న సంధించింది కూడా ఓ మహిళా జర్నలిస్టు.!
ఇప్పుడంటే, హీరోయిన్లని కేవలం గ్లామరస్ యాంగిల్‌లోనే చూడటం మొదలైందిగానీ, ఒకప్పుడు పరిస్థితి వేరు. పోలీస్ పాత్రల్లోనూ, దేవతా పాత్రల్లోనూ హీరోయిన్లను చూశాం.
అపర కాళిలా విరుచుకుపడే హీరోయిన్లు, గ్లామరస్ పాత్రల్లోనూ కనిపించారు. ఇప్పుడూ అలాంటి సినిమాలు వస్తున్నాయనుకోండి.. అది వేరే చర్చ.
Tamannaah Bhatia Shiva Shakti.. సంపత్ నంది – తమన్నా.. స్పెషల్ కాంబో..
‘ఓదెల-2’ సినిమాలో తమన్నా, శివ శక్తి పాత్రలో కనిపించబోతోంది. డీ-గ్లామర్ లుక్ అది. దర్శకుడు సంపత్ నందికి, తమన్నా అంటే స్పెషల్ లైకింగు.
‘రచ్చ’ నుంచి, చాలా సినిమాల్లో ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు సంపత్ నంది. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్‌గానూ తమన్నాని సంపత్ నంది చూపించిన సంగతి తెలిసిందే.

కథ రాసుకున్నప్పుడు పాత్ర స్వభావం గురించి తప్ప, ఇతరత్రా ఆలోచనలేమీ వుండవని సంపత్ నంది చెబుతున్నాడు. తమన్నా అంటే, కేవలం గ్లామర్ కాదు.. అంతకు మించి.. అన్నది దర్శకుడి భావన.
ఇక, ఈ విషయమై తమన్నా మాట్లాడుతూ, తెరపై గ్లామర్.. అదో యాంగిల్. శివ శక్తి అనే పాత్ర ఇంకో యాంగిల్.. పాత్రని బట్టే చూడాలి.. అదే, సంపత్ నందిలో తనకు నచ్చే విషయమని చెప్పింది.
ప్రశ్నకో రేటు..
ఇలా హీరోయిన్లు, జర్నలిస్టుల నుంచి వచ్చే దిక్కుమాలిన ప్రశ్నలకు వివరణ ఇచ్చుకోవాల్సి రావడమే భావ దారిద్ర్యం.. అంటే.!
ఆ మధ్య ఓ లేడీ జర్నలిస్టు, సినీ నటి అనన్య నాగళ్ళని ఉద్దేశించి ప్రశ్నిస్తూ, సినీ పరిశ్రమలో కమిట్మెంట్లు మామూలే కదా.. అనేసింది. దాంతో, అనన్య గుస్సా అయ్యింది.

తెరవెనుకాల ఆ జర్నలిస్టుతో, అనన్య నాగళ్ళకి క్షమాపణ చెప్పించి, వివాదాన్ని సద్దుమణిగేలా చేశారనుకోండి.. అది వేరే విషయం.
Also Read: డేవిడ్ వార్నర్‌ని అలా తిట్టొచ్చా రాజేంద్ర ప్రసాద్.?
నిజానికి, ఇలాంటి దిక్కుమాలిన ప్రశ్నలు వేయించడం కూడా ఓ తరహా పబ్లిసిటీ స్టంట్ అట.! అలాగని, సినీ పాత్రికేయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రతి ప్రశ్నకీ ఓ రేటుంది.! అలా అమ్ముడుపోయే జర్నలిస్టుల నుంచి ఇలాంటి దిక్కుమాలిన ప్రశ్నలే వస్తాయ్ మరి.! సమాధానం కూడా ముందుగానే ప్రిపేర్ చేయబడుతుంది ఇలాంటి ప్రశ్నలకి.
అద్గదీ అసలు సంగతి.!