Tanya Ravichandran Love Story.. సినీ పరిశ్రమలో నిప్పు లేకపోయినా, పొగ పుట్టేస్తుంటుంది. అందునా, అందాల భామల మీద కుప్పలు తెప్పలుగా గాసిప్స్ వచ్చేస్తుంటాయ్.
ఫలానా హీరోతో ఫలానా హీరోయిన్ భంచిక్.. అంటూ, వినిపించే గాలి వార్తలు కోకొల్లలు. ఓ సినిమా కోసం పని చేసే హీరో హీరోయిన్ల మీద గాసిప్స్ సర్వసాధారణం.
నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు.. ఇలా గాసిప్స్‌కి ఎవరూ అతీతం కాదు. చాలా సందర్భాల్లో గాసిప్స్ కేవలం, గాలి వార్తలుగా మిగిలిపోతాయ్.
కొన్ని గాసిప్స్ మాత్రమే నిజమవుతుంటాయ్. అసలంటూ గాసిప్స్ లేకుండా, సినీ పరిశ్రమలో ముందుకు సాగడం సాధ్యమయ్యే పనే కాదు.
Tanya Ravichandran Love Story.. అలా ఎలా దాచావ్.?
తాన్యా రవిచంద్రన్ గుర్తుందా.? తెలుగులో ఒకటీ అరా సినిమాలు చేసింది. అందులో, మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘గాడ్ ఫాదర్’ కూడా ఒకటి.
నయనతార చెల్లెలిగా ఓ కీలక పాత్రలో కనిపించింది తాన్యా రవిచంద్రన్. తాజాగా, సోషల్ మీడియా వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ ఫొటో షేర్ చేసింది ఈ బ్యూటీ.

అదొక రొమాంటిక్ ఫొటో. ఆమె ఒకర్ని ముద్దాడుతోంది. ఈ లిప్ లాక్ ఫొటో.. డార్క్ షేడ్‌లో ప్లాన్ చేశారు. నిజానికి, ఇందులో దాచడానికేమీ లేదు.
సినిమాటోగ్రాఫర్ గౌతమ్‌తో గత కొన్నాళ్ళుగా తాన్యా రవిచంద్రన్ ప్రేమలో వుంది. ఆ విషయాన్నే, ఈ ఫొటోతో ధృవీకరించింది తాన్యా రవిచంద్రన్.
Also Read: అందం పిచ్చి.. ఆమెను ‘అంతం’ చేసిందా.?
గౌతమ్, తాను ప్రేమలో వున్నాననీ, త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నామనీ తాన్యా రవి చంద్రన్ ప్రకటించేసింది. దాంతో, అంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.
ఇలా ఎలా.? అస్సలేమాత్రం గాసిప్ రాయళ్ళకు చిక్కకుండా, గౌతమ్‌తో తాన్యా రవిచంద్రన్ ‘ప్రేమాయణం’ నడపడమేంటి.? అని సినీ జనాలు విస్తుపోవడం సహజమే.
మొత్తమ్మీద, తాన్యా రవిచంద్రన్ చెప్పిన పెళ్ళి కబురుతో.. కాస్త షాక్‌కి గురైనా, విషయం తెలుసుకున్నాక.. విషెస్‌తో ముంచెత్తుతున్నారు ఆమెని సినీ జనాలు.