Taraka Ratna Brain Problem సినీ నటుడు నందమూరి తారక రామారావు గుండె పోటుకి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో వైద్య చికిత్స అందుతోంది.
తీవ్ర గుండె పోటు నేపథ్యంలో, మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపించింది.
గుండె సహా ఇతర ప్రధాన అవయవాలన్నీ ప్రస్తుతం సరిగ్గానే పనిచేస్తున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పిన సంగతి తెలిసిందే.
Taraka Ratna Brain Problem.. మెడికల్ బులెటిన్ ఎక్కడ.?
కుటుంబ సభ్యులు, సన్నిహితులు.. మీడియా ముందుకొచ్చ పలు విషయాలు చెబుతున్నా, వైద్యులు చెప్పేదే అధికారికం అవుతుంది.
కానీ, తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రి మెడికల్ బులెటిన్ విడుదల చేయడంలేదు. ఈ నేపథ్యంలో కొంత గందరగోళం ఏర్పడింది.
విదేశాలకు తరలింపు యోచన..
కాగా, తారక రత్నను మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విదేశాలకు తరలించేందుకు కుటుంబ సభ్యులు యోచిస్తున్నారట.
ఈ విషయాన్ని తారక రత్న కుటుంబ సన్నిహితుడైన అంబికా లక్ష్మినారాయణ వెల్లడించారు. మెదడుపై పెను ప్రభావం పడిన దరిమిలా, సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Also Read: శంకరుడికి ఆభరణంగా కైలాసానికి: చిరంజీవి హృదయ స్పందన!
ఆయా వైద్య పరీక్షల ఫలితాల అనంతరం, విదేశాలకు తారకరత్న తరలింపుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
మరోపక్క, తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.