Taraka Ratna Health Update.. నందమూరి తారకరత్న గుుండె పోటుకు గురవడం, ప్రస్తుతం ఆయన పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతుండడం తెలిసిన విషయాలే.
నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్.. ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్య చికిత్స పొందుతున్న తారకరత్నను చూశారు. వైద్యులతో మాట్లాడారు.
ఐసీయూ నుంచి బయటకు వచ్చే సమయంలో నందమూరి బాలకృష్ణ ఒకింత కంగారుగా కనిపించారు.
‘అభిమానుల ఆశీర్వాదంతో త్వరగా కోలుకుంటాడు..’ అని మధ్యాహ్నం తారకరత్న హెల్త్ గురించి అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ, రాత్రి తారకరత్నను చూశాక.. కొంత కలత చెందినట్లు కనిపిస్తోంది.
Taraka Ratna Health Update.. బాబాయ్ కదా.! భారమైన హృదయంతో..
బాబాయ్ బాలయ్య.. ఆసుపత్రి బెడ్ మీద అబ్బాయిని.. క్రిటికల్ సిట్యుయేషన్‌లో చూసి కొంత కలత చెందడం మామూలే.
తారకరత్న పరిస్థితి స్టేబుల్‌గానే వుందనీ, త్వరగానే కోలుకుంటాడనీ టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరోపక్క, తారకరత్న హెల్త్ విషయమై పలు రకాల రూమర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. అదే సమయంలో, పొలిటికల్ ట్రోలింగ్ కూడా నీఛాతినీఛంగా జరుగుతోంది.
Also Read: ఎన్టీయార్, ఏయన్నార్‌లనే లెక్క చేయని ‘జమున’.!
కాగా, మెరుగైన వైద్య చికిత్స కోసం బెంగళూరుకు తరలిస్తామని మధ్యాహ్నమే నందమూరి బాలకృష్ణ చెప్పినా, ఈ విషయమై కొంత గందరగోళం నెలకొంది.
ఈ పరిస్థితుల్లో తరలింపు ఎంతవరకు క్షేమం.? అన్న కోణంలో మల్లగుల్లాలు పడుతున్నారు.