Taraka Ratna Is Safe.. నందమూరి తారక రత్నకి ప్రాణాపాయం తప్పింది.! ఆయన పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుందట. శరీరంలో ప్రధాన అవయవాలన్నీ సక్రమంగా పని చేస్తున్నాయట.
ఈ విషయాల్ని స్వయంగా తారక రత్న బాబాయ్ నందమూరి రామకృష్ణ మీడియాకి వెల్లడించారు. ఆక్సిజన్ తనంతట తానుగా తారక రత్న తీసుకుంటున్నట్లు రామకృష్ణ పేర్కొన్నారు.
కుప్పంలో తీవ్ర గుడెపోటుతో కుప్పకూలిన తారక రత్నకు తొలుత కుప్పంలోనే అవసరమైన వైద్య చికిత్స అందించి, ఆ తర్వాత బెంగళూరుకి తరలించిన సంగతి తెలిసిందే.
Taraka Ratna Is Safe.. లైఫ్ సపోర్ట్ తగ్గిస్తున్నారు..
కాగా, వెంటిలేటర్ మీద వుంచి లైఫ్ సపోర్ట్ ఇస్తూ వచ్చారు ఇప్పటిదాకా తారక రత్నకి. చికిత్సకు తారక రత్న స్పందిస్తుండంతో, క్రమంగా లైఫ్ సపోర్ట్‌ని తగ్గిస్తున్నారు.
శరీరంలోని ప్రధాన అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తుండడంతో, పూర్తిగా వెంటిలేటర్ సహాయం తొలగించడం అనేది ముందు ముందు జరుగుతుందట.
కాగా, బ్రెయిన్‌కి జరిగిన డ్యామేజీ విషయంలోనే కొంత సందిగ్ధం వుంది. న్యూరో విభాగం ఈ విషయాన్ని లోతుగా అధ్యయనం చేస్తోంది.
నవ్వుతూ బయటకు వస్తాడు..
తారక రత్న నవ్వుతూ బయటకు వస్తాడనీ.. దానికి కొంత సమయం పడుతుందని రామకృష్ణ చెప్పుకొచ్చారు.
Also Read: నాగచైతన్యకీ దివ్యాన్షకీ మధ్య! సమ్‌థింగ్.. భంచిక్.!
మంచి వైద్యం, దానికి తోడు.. అభిమానుల ఆశీస్సులు తారక రత్నను ప్రాణ గండం నుంచి బయట పడేశాయని రామకృష్ణ చెప్పారు.
ఇదిలా వుంటే, తారక రత్నకు నేడు మరిన్ని ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
ఆ వైద్య పరీక్షల ఫలితాల అనంతరం నారాయణ హృదయాల ఆసుపత్రి ఓ మెడికల్ బులెటిన్ విడుదల చేసే అవకాశం వుంది.