Tarakaratna Health Jr NTR బెంగళూరు నారాయణ హృదయాల ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతోన్న సోదరుడు నందమూరి తారక రత్నను పరామర్శించాడు యంగ్ టైగర్ ఎన్టీయార్.
ఎన్టీయార్ వెంట కళ్యాణ్ రామ్ కూడా బెంగళూరు వెళ్ళాడు.
తారక రత్నను పరామర్శించిన అనంతరం, వైద్యులతో జూనియర్ ఎన్టీయార్ (Jr NTR) మాట్లాడాడు. తారక రత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు కళ్యాణ్ రామ్, ఎన్టీయార్.
అనంతరం జూనియర్ ఎన్టీయార్ మీడియాతో మాట్లాడుతున్నాడు. తారక రత్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పాడు.
Tarakaratna Health Jr NTR క్రిటికల్‌గానే వుంది..
ప్రస్తుతం తారక రత్న ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గానే వుందన్న జూనియర్ ఎన్టీయార్, చికిత్సకు తారక రత్న స్పందిస్తున్నట్లు చెప్పాడు.

తారక రత్న (Taraka Ratna) ‘ఎక్మో’ మీద లేడనీ, వెంటిలేటర్ మీద వుంచి ఆయనకు వైద్య చికిత్స అందిస్తున్నారని జూనియర్ తారక రాముడు వెల్లడించాడు.
మెరుగైన వైద్యంతోపాటు, అభిమానుల ఆశీస్సులు, తాతగారి ఆశీస్సులు తారక రత్న త్వరగా కోలుకునేలా చేస్తాయని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నాడు జూనియర్ ఎన్టీయార్ (Jr Nandamuri Taraka Rama Rao).
మీడియా అతి.. ఎన్టీయార్ అసహనం..
కాగా, తారక రత్న ఆరోగ్య పరిస్థితిపై మీడియా గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తుండడంతో ఎన్టీయార్ అసహనానికి గురయ్యాడు.
‘నేను డాక్టరుని కాదు.. నందమూరి కుటుంబ సభ్యుడిని. కుటుంబ సభ్యులకు వైద్యులు భరోసా ఇచ్చారు. త్వరగా అన్న తారక రత్న కోలుకుంటాడని ఆశిస్తున్నాం..’ అని చెప్పాడు ఎన్టీయార్.
Also Read: ఆర్జీవీ బాబా ‘వెన్నుపోటు’ జోస్యం.!
నిజమే మరి.! మీడియా అతి కాకపోతే.. తారక రత్న (Nandamuri Taraka Ratna) హెల్త్ కండిషన్ విషయమై కుటుంబ సభ్యుడిగా జూనియర్ ఎన్టీయార్ అంతకు మించిన వివరాలు ఏం చెప్పగలడు.?
వైద్యులు కదా.. పూర్తి వివరాలు చెప్పేది.? ఆ వైద్యుల్ని అడిగేందుకు మీడియా ప్రయత్నిస్తే బావుండేది. కుటుంబ సభ్యుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్నప్పుడు ఎన్టీయార్ అయినా, ఇంకొకరైనా ఎలా ‘ఎక్కువ’ మాట్లాడగలరు.?