Teja Sajja Mirai Media.. చిన్న కుర్రోడు.. చిన్న వయసులోనే వెండితెరపై సూపర్ హీరో.. అనిపించేసుకున్నాడు.! తిరుగులేని స్టార్‌డమ్ రాత్రికి రాత్రే వచ్చేసింది.
అదే, అక్కడే.. కొంతమందికి కన్నుకుట్టినట్లయ్యింది. పైగా, తేజ సజ్జ అంటే, మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి కల్ట్ ఫ్యాన్.
ఇంకేముంది.? కుల మాఫియా, తేజ సజ్జాని టార్గెట్ చేసేసింది. ‘మిరాయ్’ సినిమా ప్రమోషన్లు ఓ పక్క జోరుగా సాగుతున్నాయ్. ఇంకో పక్క, తేజ సజ్జాపై ట్రోలింగ్ తారాస్థాయికి చేరింది.
Teja Sajja Mirai Media.. ‘మిరాయ్’ తప్ప.. అన్నీ..
‘మిరాయ్’ సినిమా ప్రమోషన్ల నిమిత్తం, తేజ సజ్జా మీడియా ముందుకొచ్చాడు. పలువురు సినీ ఎర్నలిస్టులు ఇంటర్వ్యూలు చేస్తున్నారు.
సినీ జర్నలిస్టులైతే, పద్ధతిగా ఇంటర్వ్యూలు చేస్తారు. కానీ, ఇంటర్వ్యూలు చేస్తున్నది సినీ ఎర్నలిస్టులు కదా.. అదే అసలు సమస్య.
పైగా, కుల జాడ్యంతో కొట్టుకు ఛస్తున్న మీడియా సంస్థల్లో పని చేస్తున్న సినీ ఎర్నలిస్టులాయె.!

‘మిరాయ్’ గురించి తప్ప, మిగతా విషయాలపై గుచ్చి గుచ్చి మరీ తేజా సజ్జాని ప్రశ్నిస్తున్నారు. వాటిల్లో, ‘జై హనుమాన్’ సినిమాలో తేజ సజ్జా వున్నాడా.? లేదా.? అన్న ప్రశ్న ఒకటి.
‘జాతి రత్నాలు’ డైరెక్టర్, తేజ సజ్జా… ఇద్దరూ స్నేహితులు.. అలాంటప్పుడు, తేజ సజ్జాతో ‘జాతి రత్నాలు’ డైరెక్టర్ ఎందుకు సినిమా చేయట్లేదన్నది ఇంకో ప్రశ్న.
చెప్పుకుంటూ పోతే, పనికిమాలిన ప్రశ్నలతోనే టైమ్ అంతా తినేస్తున్నారు కొందరు సినీ ఎర్నలిస్టులు.
ఎందుకిలా తేజ టార్గెట్ అయ్యాడు.?
మెగాస్టార్ చిరంజీవి తనను ప్రోత్సహించి వుండకపోతే, ఈ రోజు సినీ పరిశ్రమలో తాను వుండేవాడిని కాదని ఓ ఇంటర్వ్యూలో తేజ సజ్జా చెప్పడంతో, అది నచ్చని కుల మాఫియా, తేజ సజ్జాని టార్గెట్ చేసింది.
పైగా, ‘ఓజీ’ గురించి కూడా కల్ట్ ఫ్యాన్‌గా తేజ సజ్జా మాట్లాడుతుండడం సోకాల్డ్ సినీ మాఫియాకీ, సినీ ఎర్నలిస్టులకీ అస్సలు నచ్చడంలేదు.

వెరసి, తేజ సజ్జా ‘మిరాయ్’.. సోకాల్డ్ తెగులు మాఫియాకి ఈజీ టార్గెట్ అయిపోయింది. అన్నట్టు, ఈ ‘మిరాయ్’ సినిమా నిర్మాత విశ్వ ప్రసాద్ కూడా పవన్ కళ్యాణ్‌కి కల్ట్ ఫ్యాన్.!
Also Read: AI సిత్తరమ్.! సినిమాకి ‘హీరోయిన్ గ్లామరు’తో పనేముంది.?
ఇప్పుడే తేజనీ, మిరాయ్‌నీ.. ఇంతలా ద్వేషిస్తున్నారంటే.. రేప్పొద్దున్న సినిమాకి ఇచ్చే దిక్కుమాలిన రివ్యూలు ఎలా వుంటాయో ఏమో.!