పరిచయం అక్కర్లేని పేరది. అదొక పేరు మాత్రమే కాదు, అదొక బ్రాండ్. సినీ రంగంలో ఏ పేరుకీ, లేనంత ప్రత్యేకత ఆ పేరుకుంది. హీ ఈజ్ నన్ అదర్ దేన్ రజనీకాంత్ (Thalaiva Rajnikanth Shocking Politics). సూపర్ స్టార్ అనే ప్రస్థావనకు నిలువెత్తు నిదర్శనం రజనీకాంత్. వెండితెరపైనే కాదు, రాజకీయాల్లోనూ తలైవాకి తిరుగుండదని నమ్మిన లక్షలాది మంది అభిమానులు మోసపోయారు.
రెండున్నర దశాబ్ధాలుగా.. అంటే పాతికేళ్లుగా ఇదుగో వస్తున్నా.. అదుగో వస్తున్నా.. అంటూ ఊరించి అభిమానుల్ని ఉస్సూరుమనిపించేశాడు సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలకు సంబంధించి, నిజానికి నా వల్ల కాదు మొర్రో.. అని రజనీకాంత్ గతంలో చూచాయగా చెప్పేసినా.. అభిమానులు ఒప్పుకోలేదు. రాజకీయాల్లోకి రావల్సిందేనని ఒత్తిడి తెచ్చారు.
అయితే, రజనీకాంత్ ఆలోచనలు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా చాలా అంశాలు ఆయన్ని రాజకీయానికి దూరంగా లాగేశాయి. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. తీవ్రమైన అనారోగ్యం నుండి కోలుకున్నారు కానీ, పూర్తిగా ఆరోగ్యవంతుడవ్వలేదు. దానికి తోడు వయసు మీద పడడమూ, ఆయనకు ఇబ్బందిగా మారింది.
నిజానికి కెమెరా ఆన్.. అనగానే రజనీకాంత్ సరికొత్త ఎనర్జీతో కనిపిస్తారు. తెరపై కనిపించే రజనీకాంత్ వేరు, నిజజీవితంలో రజనీకాంత్ వేరు. అభిమానులకే అది అర్ధం కావడం లేదు. రజనీకాంత్ అనారోగ్యం గురించి అందరికీ తెలుసు. అయినా, వెర్రి అభిమానం, వాస్తవాల్ని కనిపించకుండా చేస్తోంది.
ఐదారేళ్ల క్రితమే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావల్సి ఉంది. కానీ, కొన్ని రాజకీయ ఒత్తిడులకు ఆయన తలొగ్గక తప్పలేదు. ఇప్పుడు రజనీకాంత్ ఆరోగ్యం రాజకీయాలకు అస్సలు సహకరించదు. అవును, తన అనారోగ్య పరిస్థితి వల్ల రజనీకాంత్ రాజకీయాలకు భయపడుతున్నాడు.
కానీ, రాజకీయాల్లోకి వచ్చేస్తా.. మార్పు తెచ్చేస్తా.. అని రజనీకాంత్ అభిమానుల్ని, అవాస్తవ ప్రపంచంలోకి నెట్టేయడం మాత్రం క్షమించరాని ఘోర తప్పిదం (Thalaiva Rajnikanth Shocking Politics) అంటారు చాలామంది.