The Kerala Story మొన్నామధ్య ‘ది కాశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా పెను సంచలనం.! కాశ్మీర్‌లో హిందూ పండిట్ల ఊచకోత గురించి సవివరంగా పేర్కొన్నారు అందులో.
ఇక, ఇప్పుడు ‘ది కేరళ స్టోరీ’ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. అసలు ఈ సినిమాలో ఏముంది.? కొందరు యువతుల్ని బలవంతంగా మత మార్పిడికి గురిచేసి, వారిని ‘ఐసిస్’ తీవ్రవాదం వైపు మళ్ళిస్తున్నారన్నదే ఈ సినిమా కథ.
సినిమా విడుదలకు ముందే వివాదాలు రాజుకున్నాయి. విషయం కోర్టుదాకా వెళ్ళింది. సినిమా రిలీజ్‌కి కొద్ది రోజుల ముందు సినిమాని బ్యాన్ చేయాలన్న నినాదాలు ఎంతవరకు సబబు.? అని ధర్మాసనం కూడా ప్రశ్నించింది.
The Kerala Story.. సినిమా అంటేనే క్రియేటివిటీ.?
నిజానికి, సినిమా అంటే క్రియేటివ్ ప్రపంచం. క్రియేటివిటీకి ఆకాశమే హద్దు సినీ పరిశ్రమలో. కానీ, సినిమా ముసుగులో ‘రాజకీయ అవసరాలు’ తీర్చడం అనేదొకటి జరుగుతోంది ఇటీవలి కాలంలో.
ఓ సామాజిక వర్గాన్ని కించపర్చడం.. ఓ మతాన్ని టార్గెట్‌గా చేసుకోవడం.. ఇలాంటి వ్యవహారాలు సినిమాలకు సంబంధించి తరచూ వింటూనే వున్నాం.

ఆ కారణంగానే కొన్ని సినిమాలు తిరస్కరణకు గురవుతున్నాయి. సినీ ప్రముఖులపై దాడులూ జరుగుతున్నాయి. అయితే, ప్రజాస్వామ్యంలో దాడులకు చోటుండకూడదు.
కానీ, పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడానికే.. అన్నట్లు కొన్ని సినిమాలు తెరకెక్కుతున్నాయి. కానీ, వాటిని నిలువరించలేని పరిస్థితి.
ఇందులో దాపరికం ఏముంది.?
మహిళల్నే కాదు.. యువకుల్ని కూడా ఐసిస్ వైపు బలవంతంగా మళ్ళిస్తున్నారు కొందరు. బారతదేశంలో మతమార్పిడులు కొత్త విషయం కాదు.
Also Read: ఔను.! మోసం చేశాం.! ‘ఏజెంట్’ నిర్మాత ఒప్పుకోలు.!
బలవంతపు మత మార్పిడుల గురించి ఎప్పటికప్పుడు వింటూనే వున్నాం. అలాంటప్పుడు, సినిమాలో తప్పుగా ఏం చూపించారని అనగలం.?
మామూలుగా అయితే ఎలాంటి సందడీ లేకుండా సినిమా వచ్చి వెళ్ళిపోయేదే.. ఒకవేళ సినిమాలో విషయం లేకపోతే. బావున్నా కూడా, వసూళ్ళు బాగా వచ్చేవి.
ఇప్పుడీ వివాదాల కారణంగా సినిమాలో కంటెంట్ వున్నా లేకున్నా, దానికి వసూళ్ళ వర్షం కురిసే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో, సమాజంలో అలజడీ పెరుగుతుంది. ఆ అలజడి సమాజానికి మేలు చేయదు.