The Kerala Story Row దేశాన్ని కుదిపేస్తోంది ఓ సినిమా.! అదే ‘ది కేరళ స్టోరీ’.! మలయాళ సినిమా అయినా, దేశవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది.
సుమారు 32 వేల మంది యువతులు మత మార్పిడికి గురై, ఐసిస్ తీవ్రవాద సంస్థ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందన్నది ఈ సినిమా గురించిన అసలు కథ.
కథ కాదిది.. వాస్తవం.. అంటోంది ‘ది కేరళ స్టోరీ’ చిత్ర యూనిట్.! అదే అసలు సమస్య అయి కూర్చుంది.
వివాదం ముదిరి పాకాన పడింది. దాంతో, సినిమాకి పబ్లిసిటీ కూడా పెరిగింది. అసలు సినిమాలో ఏముందో తెలుసుకోవాలని దేశమంతా అనుకుంటోంది.
The Kerala Story Row.. మత మార్పిడులు వాస్తవమే..
ఔను, మత మార్పిడులు వాస్తవమే.! లవ్ జిహాద్ దేశంలో చాపకింద నీరులా విస్తరించింది. ఆ మూలాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే వున్నాయి.
అయితే, 32 వేల మంది కాదు.. చాలా తక్కువ మందే.. అంటున్నారు కొందరు. కేరళ ముఖ చిత్రాన్ని చెత్తగా చూపించే ప్రయత్నమన్నది వారి ఆరోపణ.

అంటే, వాస్తవం వుందని ఒప్పేసుకుంటున్నట్లే.! అందుకే, బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో సినిమాని అభినందించి తీరాలి.
‘అవును, మా కన్నీళ్ళు నిజం. మా ఆడబిడ్డల జీవితాలు నాశనమైపోయాయన్నది వాస్తవం..’ అంటున్నాయి బాధిత కుటుంబాలు.
నిజాన్ని ఒప్పుకోం.. పాతరేస్తాం.!
నిజాన్ని ఒప్పుకోలేకపోవడం ఓ రుగ్మత. ‘ది కేరళ స్టోరీ’ విషయంలో అదే జరుగుతోంది.! ఆ రుగ్మతే సినిమాపై బురద చల్లేలా చేస్తోంది.
సినిమా వెనుక రాజకీయ ప్రయోజనాలన్నది వేరే కోణం.! సినిమాలో చూపించిన విషయంలో వాస్తవం వుందా.? లేదా.? అన్నది ముఖ్యం.
Also Read: కాజల్ అగర్వాల్ కూడా మొదలెట్టేసిందిగా.!
అదే సమయంలో, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి సినిమాల్ని తెరకెక్కిస్తే అది సమాజంలో అలజడికి కారణమవుతుంది.
నిర్మాతలు డబ్బుల్ని పోగేసుకుంటారు.. రాజకీయ పార్టీలకు రాజకీయ లబ్ది చేకూరుతుంది.. కానీ, సమాజమే నష్టపోతుంది. ఇది ముమ్మాటికీ బాధ్యతారాహిత్యమే.
మామూలుగా అయితే, ఈ తరహా సినిమాల్ని రాజకీయ కోణంలో చూడటమూ భావ్యం కాదు. కానీ, రాజకీయ లక్ష్యాలతో సినిమాలు తెరకెక్కిస్తున్నప్పుడు సహజంగానే ఆక్షేపణ వచ్చి తీరుతుంది.