Tillu Square Postponed Again.. టిల్లుగాన్కి ఏమయ్యింది.? ఏమైతది.. ఏమీ కాలేదు.! కాకపోతే, టిల్లుగాన్ని పక్కకి తోసేశారు.!
సింపుల్‌గా చెప్పాలంటే, పక్కకి పోయి ఆడుకో.. అంటూ టిల్లుగాడ్ని ఏకంగా ఫిబ్రవరికి నెట్టేశారు.!
అసలు, ‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రారంభమవడమే ఓ పెద్ద పంచాయితీ అయిపోయింది.! ఆ హీరోయిన్.. ఈ హీరోయిన్.. అంటూ, చివరికి అనుపమ పరమేశ్వరన్‌తో సరిపెట్టారు.
Tillu Square Postponed Again.. సంబరం.. అయోమయం.!
ఎలాగోలా సినిమా మొదలై, పూర్తయిపోతోందని టిల్లుగాని అభిమానులు సంతోషపడ్డారాయె.! విజయదశమి కంటే ముందు వచ్చేస్తుందని అనుకున్నారు.
డేట్ కూడా దాదాపుగా వచ్చేసింది. కానీ, సినిమా రాలేదు.! ఇప్పుడేమో ఫిబ్రవరికి నెట్టేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.
సిద్దు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ అప్పట్లో పెద్ద విజయాన్ని అందుకుంది. నేహా శెట్టి హీరోయిన్.
ఆ ‘డీజే టిల్లు’కి సీక్వెల్ ఈ ‘టిల్లు స్క్వేర్’.! అనుపమ పరమేశ్వరన్ ఈసారి సిద్దూ జొన్నలగడ్డతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది.
మంచి మార్కెట్ వున్నాగానీ..
సినిమాకి మంచి బజ్ వుంది మార్కెట్‌లో.! కానీ, నిర్మాణ సంస్థ సినిమాని ఆలస్యం చేస్తూ వచ్చింది.
ఇంతకీ తప్పెవరిది.? హీరోదా.? నిర్మాణ సంస్థదా.? దర్శకుడిదా.? తప్పెవరిదైతేనేం, సినిమా మాత్రం వెనక్కి నెట్టేయబడింది.!
ఫిబ్రవరిలో అయినా వస్తుందా.? ఏమో, ఇప్పటికైతే సస్పెన్స్. డేట్ ఇచ్చేయడం కష్టమేమీ కాదు. మార్చేయడం అస్సలు కష్టం కాదు.!