Table of Contents
Tollywood Problems Bunny Vas.. సినిమా అంటే వ్యాపారం.! ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే, కళాత్మక వ్యాపారం ఇది.!
ఖచ్చితంగా సినిమాకి హైప్ కావాల్సిందే.. ఆ హైప్ వల్లనే, ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించగలుగుతారు. కానీ, హైప్‌కి తగ్గట్టు సినిమా లేకపోతే.. అంతే సంగతులు.!
ప్రేక్షకుడికి సినిమా చూడాలన్న ఆసక్తి వుండాలి.. సినిమాకి సంబంధించిన అన్ని విషయాలూ ముందే లీకైపోతోంటే, ప్రేక్షకుడు ఎందుకు థియేటర్ వరకూ వస్తాడు.?
టిక్కెట్ ధరల మోత.. ఇది ఇంకో సమస్య. ఓటీటీలో ఉచితంగా సినిమా దొరుకుతోంటే, ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే కూర్చుని చూస్తాడుగానీ, ప్రేక్షకుడు థియేటర్లో సినిమా చూడటానికి ఇష్టపడతాడా.?
చెప్పుకుంటూ పోతే, బోల్డన్ని సమస్యలున్నాయి.! ఇంతలోనే, పంపకాయల పంచాయితీ.. ఈ క్రమంలో సినిమా థియేటర్ల బంద్ ప్రస్తావన.
Tollywood Problems Bunny Vas.. ప్రేక్షకుడ్ని సినిమాతో మెప్పించి, థియేటర్లకు రప్పించడమెలా.?
వెరసి, సినిమా అంటేనే, ప్రేక్షకుడికి అసహ్యం పుట్టుకొస్తున్న పరిస్థితుల్ని చూస్తున్నాం. ఇంతకీ తప్పెవరిది.?
పంపకాల పంచాయితీ విషయమై నిర్మాత బన్నీ వాస్, ఆసక్తికరమైన కామెంట్ చేశారు సోషల్ మీడియాలో.
ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని..!

ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావుల.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు.
మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలి తప్ప.. ఇలాగ సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటిటికి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే .. రాబోయే నాలుగైదు ఏళ్లలో 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి.
పెద్ద హీరోలు మాట వింటారా.?
ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు రెండు సంవత్సరాలకు ఒక సినిమా మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు.
ఈ రెండు మూడేళ్లలో చాలా మంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు.

సింగిల్ స్క్రీన్స్ మూత పడినట్టైతే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ అయితే పెద్ద హీరోలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళుతుంది.
ఇదీ బన్సీ వాస్ ఆవేదనతో కూడిన విశ్లేషణ.! ఇందులో కొంత నిజం లేకపోలేదు.! హీరోలు, ఎక్కువ సినిమాలు చేయాలి. కానీ, చేయడంలేదు కదా.?
లీకుల పాపం మీదే కదా.?
ఉదయం ఆట కంటే ముందే వస్తున్న దిక్కుమాలిన రివ్యూలు, కాంబినేషన్ దగ్గర్నుంచి, సినిమాల్లో ట్విస్టులు.. అన్నీ, ముందే లీకైపోతుండడం.. ఇలాంటి చాలా సమస్యలున్నాయ్.
చిత్రమేంటంటే, ఆ లీకు వీరుల్ని దర్శక నిర్మాతలు, నటీనటులు కూడా ఎంటర్టైన్ చేస్తుండడం. థియేటర్ల బంద్ విషయాన్ని ఎగ్జిబిటర్లు, సినీ ఎర్నలిస్టులకు లీక్ చేశారంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
సమస్యలేంటో అందరికీ తెలుసు. పరిష్కారమేంటో కూడా తెలుసు.! కానీ, సినీ పరిశ్రమలో ఎవడి యాపారం ఆడిది.! ఎవరి కక్కుర్తి ఆడిది.!
థియేటర్లను గుప్పిట్లో పెట్టుకుని, సాటి నిర్మాతల్నే వేధిస్తున్న ‘ఆ నలుగురు నిర్మాతల’ గురించి బన్నీ వాస్‌కి తెలియదా.?
బన్నీ వాస్‌కి అల్లు అర్జున్ అత్యంత సన్నిహితుడు. ఏడాదికి ఓ సినిమా చేయాలని తన అభిమాన హీరోకి బన్నీ వాస్ చెప్పలేడా.? చెప్పి ఒప్పించలేడా.?
ఫైనల్‌గా చెప్పాలంటే, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.? ఇదీ అసలు సమస్య.!