Table of Contents
Tomato Price Hike దేశంలో టమాటా ధరలు కొత్తగా పెరిగాయా.? లేదే, గతంలో కూడా టమాటా ధరలు సెంచరీ కొట్టేశాయ్ కదా.!
లీటరు పెట్రోల్ ధర సెంచరీ ఎప్పుడో దాటేసింది.. కొన్నాళ్ళు ఆ పెట్రోల్ ధరలపై యాగీ జరిగింది.. ఆ తర్వాత అంతా లైట్ తీసుకున్నారు. అలవాటైపోయిందిప్పుడు అది.!
ఉల్లి ధరల విషయాన్నే తీసుకుంటే, కిలో ఉల్లిపాయల్ని రెండొందల రూపాయలకు కొనుగోలు చేసిన సందర్భాలున్నాయ్.!
Tomato Price Hike ఇది కలికాలం.. ధరలు మండే కాలం.!
కొన్నాళ్ళ క్రితం వంట నూనె ధరలు 200 దాటేశాయ్.. మూడొందల రూపాయల్నీ టచ్ చేసింది వంట నూనె ధర.!
ఇప్పుడు టమాటా ధరలు గణనీయంగా పెరిగిపోయాయ్.! దేశంలో టమాటా పంట తగినంతగా లేదా.? వుండీ, ఈ దుస్థితి దాపురించిందా.?
డిమాండ్ – సప్లయ్.. ఈ సూత్రానికి అనుగుణంగా రేట్లు పెరగడం, తగ్గడం జరుగుతుంటుంది. మార్కెట్‌లో దళారీల కారణంగానే ధరలు అనూహ్యంగా పెరిగిపోతుంటాయి.

ఇదొక మాఫియా.! అప్పట్లో ఉల్లి ధరలైనా.. ఇప్పుడు టమాటా ధరలైనా.. నడుస్తున్నది మాఫియానే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
ప్రభుత్వాల పబ్లిసిటీ స్టంట్లు..
ప్రభుత్వాలేమో పబ్లిసిటీ స్టంట్లు చేస్తుంటాయ్. పోనీ, ధరల పెరుగుదల వల్ల రైతులకు ఏమన్నా లాభం వుందా.? అంటే అదీ లేదు.
అన్నట్టు, టమాటా పండిస్తున్న రైతులు, తమ పొలాల వద్ద సెక్యూరిటీ పెట్టుకోవాల్సి వస్తోందట. కొందరు రైతులు ఆయా పంట పొలాల వద్ద హత్యకు గురవుతున్నారట కూడా.
ఇదండీ మన ఘన భారతం.! ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయ్.? అని మాత్రం అడగొద్దు. ప్రభుత్వాలు నడుపుతున్నోళ్ళు రాజకీయంలో బిజీగా వుంటారు.
వెటకారమా.? పైశాచిక ఆనందమా.?
ఇక, టమాటా ధరలు సమాన్య జనాన్ని బెంబేలెత్తిస్తోంటే.. సోషల్ మీడియా పుణ్యమా అని.. పబ్లిసిటీ స్టంట్లు ఇంకో వైపు నడుస్తున్నాయి.
Also Read: వైరల్ వీడియో.! జింకలు పాముల్ని తింటాయా.?
టమాటాలతో తులాభారమట.! టమాటాల్ని పెళ్ళి కానుకలుగా ఇస్తున్నారట.! మనిషిలో వెటకారం పెరిగిందనుకోవాలా.? పైశాచికానందం పెరిగిందని అనుకోవాలా.?

ఏం, ఓ నెల రోజులు టమాటా తినకపోతే చచ్చిపోతామా.? అనుకుంటే.. అసలు ఈ ధరల పెరుగుదల సమస్యే వుండదు కదా.. టమాటా విషయంలో.!
దారుణమైన విషయమేంటంటే, ఇదే టమాటా ధర.. ఒక్కోసారి అర్థ రూపాయి కంటే తక్కువకు పడిపోతుంటుంది.! అప్పుడూ రైతులు చనిపోతుంటారు.. ఆత్మహత్యలకు పాల్పడి.!