Home » త్రిషకి ఫుల్ సపోర్ట్.! ప్రత్యక్ష రాజకీయాల్లోకి కూడా వచ్చేస్తుందా.?

త్రిషకి ఫుల్ సపోర్ట్.! ప్రత్యక్ష రాజకీయాల్లోకి కూడా వచ్చేస్తుందా.?

by hellomudra
0 comments
Trisha Krishnan

Trisha Krishnan Politics TN.. తమిళనాట రాజకీయాలు ఎంత చిత్రంగా వుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అత్యంత జుగుప్సాకరంగానూ వుంటాయి.. అంతే హుందాగానూ మారిపోతుంటాయ్.!

టీవీకే అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన తమిళ నటుడు విజయ్, త్వరలో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న సంగతి తెలిసిందే.

విజయ్, త్రిష మధ్య గత కొన్నేళ్ళుగా వున్న స్నేహం చుట్టూ, తమిళ రాజకీయాల్లో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొందరు రాజకీయ నాయకులు, త్రిష మీద తీవ్రమైన ఆరోపణలు చేయడం చూశాం.

రాజకీయ ప్రత్యర్థి అయిన విజయ్‌ని ఇరుకున పెట్టడానికి, త్రిష పేరుని కొందరు తెరపైకి తెస్తున్నారు. అయితే, అలాంటివారిపై త్రిష ఆల్రెడీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది.

ఇంకోపక్క, త్రిషకి తమిళ రాజకీయాల్లో మద్దతు పెరుగుతోంది. పలువురు సినీ ప్రముఖులు, త్రిషకి మద్దతుగా నిలుస్తున్నారు.

Trisha Krishnan Politics TN.. సినిమా వేరు.. రాజకీయాలు వేరు..

సినిమా స్నేహాలు వేరు, రాజకీయ వ్యవహారాలు వేరు.. అంటూ తాజాగా, సీనియర్ నటి ఖుష్బూ, త్రిషకి బాసటగా నిలిచింది.

రాజకీయ ఆరోపణలేమైనా చేసుకోవాలంటే విజయ్ మీద చేసుకోవచ్చనీ, రాజకీయ వివాదాల్లోకి త్రిషని లాగడం సబబు కాదని ఖుష్బూ తాజాగా వ్యాఖ్యానించింది.

విజయ్ – త్రిష మధ్య స్నేహం, వారి వ్యక్తిగత విషయమనీ, తన కుటుంబంలో తలెత్తిన గొడవల్ని విజయ్ పరిష్కరించుకుంటారని ఖుష్బూ వ్యాఖ్యానించడం గమనార్హం.

విజయ్ విడాకుల పంచాయితీ..

తన భర్త నుంచి విడాకులు కోరుతూ ఇటీవలే విజయ్ భార్య సంగీత కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 250 కోట్ల రూపాయల మేర కోర్టు బయట సెటిల్మెంట్‌కి రంగం సిద్ధమయ్ిందన్న ప్రచారమూ జరుగుతోంది.

విడాకులు వస్తే, వెంటనే త్రిషని విజయ్ పెళ్ళి చేసుకుంటారన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. కానీ, తమిళనాడులో ఎన్నికల హీట్ పెరిగిపోయింది.

Also Read: చక్కనమ్మ చెవులకెందుకింత ‘బరువు’ బాధ్యతలు.?

ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసింది. సో, ఇప్పుడీ పెళ్ళి వ్యవహారాలపై విజయ్ ముందడుగు వేసే ప్రసక్తే లేదు. మరోపక్క, విజయ్ సినిమా ‘జన నాయగన్’ విడుదలకు ఆటంకాలు ఎదురవుతూనే వున్నాయి.

ఇంతకీ, త్రిష పరిస్థితేంటి.? తమిళ రాజకీయాల్లో వినిపిస్తున్నట్లుగా త్రిష రాజకీయ తెరంగేట్రానికి రంగం సిద్ధమయ్యిందా.? విజయ్ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుందా.? పోటీ కూడా చేస్తుందా.?

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group