Trisha Krishnan Telugu Cinema.. ఒకప్పుడు త్రిష స్టార్ హీరోయిన్ తెలుగులో. కానీ, ఇప్పుడు ఆ స్టార్‌డమ్‌ని తమిళంలో ఎంజాయ్ చేస్తోంది త్రిష కృష్ణన్.
ఛాన్సిస్తే, తెలుగులోనూ మళ్లీ త్రిష ఎడా పెడా సినిమాలు చేసేందుకు సిద్ధంగానే వుంది. ఈ సంగతి ‘ఆచార్య’ సినిమా టైమ్‌లోనే త్రిష బయట పెట్టింది కూడా.
నిజానికి ‘ఆచార్య’ సినిమాలో త్రిష నటించాల్సి వుంది. కానీ, వేరే కారణాల వల్ల కాజల్ అగర్వాల్‌ని (Kajal Aggarwal) హీరోయిన్‌గా ఎంచుకున్నారు. అది కూడా వర్కవుట్ కాలేదనుకోండి ఫైనల్‌గా.
Trisha Krishnan Telugu Cinema.. త్రిషని టాలీవుడ్ లైట్ తీసుకుంటోందా.?
అసలు విషయమేంటంటే, త్రిష చేస్తానన్నా, టాలీవుడ్ మేకర్లు ఎందుకో త్రిష (Trisha Krishnan) విషయంలో అంత సుముఖంగా లేరని తెలుస్తోంది.
బహుశా రెమ్యునరేషన్ కారణాలు కావచ్చు.. మరింకేదైనా కారణం కావచ్చు. ఎందుకో తెలీదు కానీ, త్రిష అంటే వద్దంటున్నారట తెలుగు మేకర్లు.

సీనియర్ హీరోలకు టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత దారుణంగా వుంది. సీనియర్ హీరోలు చూస్తూ జోరు మీదున్నారు. కానీ, హీరోయిన్ల విషయంలోనే చిన్నపాటి తప్పులు దొర్లుతున్నాయ్.
త్రిషని కాస్త పట్టించుకోరూ!
నిన్న కాక మొన్న ‘భోళా శంకర్’ (Bholaa Shankar) సినిమాలో తమన్నా, మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) జంట విషయంలో కొన్ని అపోహలున్నాయ్. అదే త్రిష అయితే, ఎలాంటి ఆక్షేపణా వుండేది కాదన్న అభిప్రాయాలు వున్నాయ్.
ప్రస్తుతం బాలయ్య తాజా సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అలాగే మరో సీనియర్ హీరో అయిన నాగార్జున కొత్త భామ మృణాల్ ఠాకూర్‌ని లైన్‌లో పెడుతున్నాడు.
వెంకటేష్ ఏదో తంటాలు పడుతున్నాడనుకోండి. అలాగే, పవన్ కళ్యాణ్ కావచ్చు. మహేష్ బాబు కావచ్చు.. ముఖ్యంగా చిరంజీవి తన తదుపరి సినిమాల గురించి కావచ్చు.
Also Read: కర్ర పెత్తనం.! ‘పులి’ రాజా.. పారిపో.!
హీరోయిన్ల విషయంలో కాస్త స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన ఆవశ్యకత వుంది. ఇక నుంచైనా మన టాలీవుడ్ మేకర్లు, లేదా సీనియర్ హీరోలైనా ఈ వాస్తవాన్ని గుర్తెరిగితే బావుంటుంది.