Table of Contents
Trivikram Srinivas Bro PSPK.. ప్రముఖ మాటల రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద విపరీతమైన నెగెటివిటీని సోషల్ మీడియాలో చూస్తున్నాం.
‘బ్రో’ సినిమాతో అది మరింత పెరిగింది. హీరోయిన్లతో లింకులు పెట్టడం దగ్గర్నుంచి, ‘బ్రో’ (Bro The Avatar) సినిమా వరకూ .. త్రివిక్రమ్ మీద కనిపిస్తున్న నెగెటివిటీ అంతా ఇంతా కాదు.!
ఎందుకిదంతా.? త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) చేసిన తప్పేంటి.? ఈ విషయమై ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో లోతైన చర్చ జరుగుతోంది.
గుంటూరు.. కారం.!
సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం‘ (Guntur Kaaram) సినిమా నుంచి పూజా హెగ్దే (Pooja Hegde) తప్పుకుంది. ఆ స్థానంలోకి శ్రీలీల (Sreeleela) ప్రమోట్ అయ్యింది.
అంతకు ముందు శ్రీలీలకు ఆ సినిమాలో అసైన్ చేయబడిన పాత్ర కోసం ఆ తర్వాత మీనాక్షి చౌదరిని (Meenakshi Chaudhary) తీసుకోవాల్సి వచ్చింది.
పలు కారణాలుంటాయి, సినిమా నిర్మాణంలో ఆలస్యం జరగడానికి. దానికి కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్‌ని బాధ్యుడిని చేస్తే ఎలా.?
Trivikram Srinivas Bro PSPK.. ‘బ్రో’ విషయానికొస్తే..
పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) తాజా సినిమా ‘బ్రో’ (Bro The Avatar) విషయంలోనూ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద విమర్శలు వినిపిస్తున్నాయి.
రాజకీయ పరమైన డైలాగులు అనవసరంగా జొప్పించారనీ, కేవలం పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలు మాత్రమే చేసేలా త్రివిక్రమ్ చెడగొడుతున్నాడనీ.. అబ్బో బోల్డన్ని విమర్శలు.

అయితే, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా వుండడం వల్ల, త్రివిక్రమ్ సాయం తీసుకోక తప్పడంలేదు. సినిమాల పరంగా.
సో, పవన్ కళ్యాణ్ ‘వీలు’కి అనుగుణంగా, త్రివిక్రమ్ ఆయా ప్రాజెక్టుల్ని సెట్ చేస్తున్నారు.. అదీ తనకు కాస్త వెసులుబాటు వున్న సమయంలో మాత్రమే.
స్నేహితుడి సినిమా కావడంతో, రచన పరంగా తన ముద్ర వుండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇందులో త్రివిక్రమ్ చేసిన తప్పేముంది.?
ఫ్లాప్.. దుష్ప్రచారం..
‘వకీల్ సాబ్’ డిజాస్టర్ అన్నారు. ‘భీమ్లానాయక్’ డిజాస్టర్ అన్నారు. ఇప్పుడేమో ‘బ్రో’ డిజాస్టర్ అంటున్నారు.! కానీ, ప్రేక్షకులు ఆయా సినిమాల్ని ఆదరిస్తున్నప్పుడు, ఈ ఫ్లాప్ అన్న చర్చ ఎందుకు.?
రీమేక్ సినిమాలే అయినా, 100 కోట్ల పైన వసూళ్ళను రాబడుతున్నాయంటే.. అందుకే కదా, నిర్మాతలు పవన్ కళ్యాణ్ వెంట పడుతున్నది.
Also Read: ‘వారాహి’ అంటే పంది కాదు.! దేవతరా.! అచ్చోసిన ఆంబోతూ.!
మేటర్ క్లియర్.. త్రివిక్రమ్‌ని టార్గెట్ చేస్తే.. పవన్ కళ్యాణ్‌కి (Power Star Pawan Kalyan) సినిమాల పరంగా రైట్ హ్యాండ్ దెబ్బ తిన్నట్లే.
ఆ తర్వాత పవన్ ప్రధాన ఆదాయ వనరు అయిన సినిమాని ఆయనకు దూరం చేయడానికి వీలవుతుంది. ఇదీ పవన్ రాజకీయ ప్రత్యర్థుల ఎత్తుగడ. కానీ, ఆ పప్పులుడకడంలేదు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి స్నేహితుడ్ని పవన్ కళ్యాణ్ వదులుకునే పరిస్థితి లేదు. అదే సమయంలో, పవన్ కళ్యాణ్‌ని త్రివిక్రమ్ శ్రీనివాస్ వదిలిపెట్టే అవకాశమూ లేదు.