Table of Contents
Trump Tax Against India.. ప్రపంచానికి పెద్దన్న అమెరికా.. ఆ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.! ఇది అందరికీ తెలిసిన విషయమే.!
పెద్దన్న అయితే మాత్రం, వాడు చెప్పింది ప్రపంచమంతా వినాలా.? ఏంటి.? కుటుంబంలోనే ఇలాంటి చర్చ జరుగుతుంటుంది.
నిజానికి, అమెరికా అంటే ప్రపంచానికి పెద్దన్న ఏమీ కాదు. అమెరికా విధానమే, ‘అమెరికా ఫస్ట్’ అని. అలాంటప్పుడు, ప్రపంచానికి పెద్దన్న ఎలా అవుతుంది అమెరికా.?
Trump Tax Against India.. పెద్దన్న అంటే..
ఏదో మాట వరసకి ‘ప్రపంచానికి పెద్దన్న అమెరికా’ అంటుంటాం అంతే.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు, ఉద్యోగ అలానే ఉపాధి అవకాశాలు.. ఈ కారణంగా, అమెరికా వైపు ‘మోజు’ ఎక్కువవుతున్నమాట వాస్తవం.
అలాగని, పెద్దన్న ‘పన్నుల మోత మోగిస్తూ వుంటే’ చూస్తూ ఊరుకుంటామా.? ఆ పన్నుల వాత భరించగలమా.? అవమానిస్తుంటే, ఆ అవమానాల్ని తట్టుకుని బానిసత్వం చేయగలమా.?
భారత దేశంపై అమెరికా పన్నుల మోత మోగిస్తోంది. దీనిపై సహజంగానే, భారత ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించింది.
నోటి దురద..
నోటి దురదకి కేరాఫ్ అడ్రస్ అయిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ‘డెడ్ ఎకానమీ’ అంటూ, ఇండియా మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
దాంతో, ట్రంప్ అంటేనే అసహ్యం వేస్తోందిక్కడ చాలామందికి. కానీ, కొందరికి మాత్రం ఆ ‘కంపు’ మహా ‘ఇంపు’గా మారిపోయింది. ట్రంప్ చెప్పిందే నిజం.. అంటూ విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు.
Also Read: ‘జమిలి’ వస్తే, పులివెందులలో జగన్ ఓడిపోవడం ఖాయమా.?
మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో, భారత దేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ చేసిన ఆరోపణలకి, ఇక్కడ కొందరు వత్తాసు పలికిన సంగతి తెలిసిందే.
శతృవు, మనల్ని అభినందిస్తే.. ఆహ్వానించాలి.. అదే శతృవు, మనల్ని తూలనాడితే చెప్పుతో కొట్టాలి. అప్పుడే కదా, ‘ఇండియా ఫస్ట్’ అవుతుంది.? అది కదా, దేశ భక్తి అంటే.
మనమంతా ఒక్కటి..
రాజకీయంగా ఇక్కడేమైనా ఆధిపత్య పోరు వుంటే, ఇక్కడే తేల్చుకోవాలి.. శతృవు ముందర మాత్రం మనమంతా ఒక్కటిగా నిలబడి, ముక్త కంటంతో శతృవుని చీల్చిచెండాడాలి.
దురదృష్టవశాత్తూ, ఈ ఆలోచన కొరవడుతోంది మన దేశంలో కొందరికి. అదే అతి పెద్ద సమస్యగా మారుతోంది.
రష్యా నుంచి మనం చమురు కొనుగోలు చేయడం, డోనాల్డ్ ట్రంప్‌కి నచ్చలేదు, నచ్చదు కూడా. అమెరికా తయారీ ఎఫ్-35 యుద్ధ విమానాల్ని భారత్‌కి అంటగట్టాలన్నది ట్రంప్ ఆలోచన.
కానీ, భారత రక్షణ రంగ అవసరాలు వేరు. అమెరికాతో సత్సంబంధాలు ముఖ్యమే కానీ, అలాగని, మన దేశ ప్రయోజనాల్ని పణంగా పెట్టలేం కదా, ట్రంప్‌ని మెప్పించడానికి.?
ఈ చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా.?