Turmeric Health Benefits.. మన హిందూ సాంప్రదాయంలో ‘పసుపు’కు ప్రత్యేకమైన, పవిత్రమైన స్థానం ఉంది. పసుపును మంగళకరంగా భావిస్తుంటారు. అలాగే ఆరోగ్యం విషయంలోనూ పూర్వ కాలం నుంచీ పసుపు ప్రస్థావన చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఆయుర్వేదంలో పసుపుకు విశిష్ట ప్రాధాన్యత ఉంది.
అయితే, వింటర్‌లో అదేనండీ చలికాలంలో రకరకాల రోగాలు, చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు ‘పసుపు’ చక్కగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక పుండ్లు, గాయాలకు కూడా పసుపు శాశ్వత మందుగా చెప్పుకోవచ్చు.
Turmeric Health Benefits వంటింట్లోనే దివ్యౌషధం..
శీతాకాలంలో చర్మం పొడిబారిపోవడం, కీళ్లు పట్టేయడం, అజీర్తి, జలుబు, దగ్గు తదితర అనారోగ్య సమస్యలు చిరాకు పెడుతుంటాయి. చిన్న సమస్యలే ఇవి. అలాగని అదే పనిగా వేధించే ఇలాంటి సమస్యలను నివారించుకోవడం కోసం పదే పదే ఆసుపత్రుల చుట్టూ తిరగలేం కదా. అందుకే, మన వంటింటి క్వీన్ పసుపుతో కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాఠిస్తే కాస్త ఉపశమనం పొందొచ్చనేది ఆయుర్వేద నిపుణుల సలహా.

మన భారతీయ సంప్రదాయాల ప్రకారం చాలా ఆహార పదార్థాల తయారీలో పసుపు వాడడమనేది అలవాటుగా వస్తున్నదే. ఆహార పదార్థాల్లోనే కాదు, సౌందర్య పోషణలోనూ పసుపు వాడకానికి ప్రత్యేకత వుంది. అందుకే, పసుపు చేసే మేలు గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.
పసుపును ఆహారంలో రెగ్యులర్ చేసుకోవడం వల్ల డయాబెటిస్ ముప్పు నుండి కాస్త దూరంగా ఉండొచ్చట. ఇంగ్లీష్ మందులకు అంతు చిక్కని చర్మ సమస్యలు, బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లను తగ్గించడానికి పసుపు చక్కని పరిష్కారం. అలాగే, చలి కాలం రుగ్మతల నుండి పసుపుతో ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.
కిడ్నీ, లివర్ సమస్యలకూ పసుపు చక్కని పరిష్కారం
చలిని తట్టుకోవడం కోసం వేడి వేడి పానీయాలను ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాం. అలా తరచూ చేయడం వల్ల లివర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే, జీర్ణ వ్యవస్థ కూడా అస్థవ్యస్తమయ్యే అవకాశాలున్నాయి. అంతేకాదు, ఆల్కహాల్ అలవాటున్న వాళ్లకీ లివర్ సమస్యలు అధికమే.
పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి లోపలి నుంచి చికిత్సనందిస్తాయి. జీర్ణక్రియ సవ్యంగా సాగేందుకు పసుపు తోడ్పడుతుంది. అలాగే చర్మ సౌందర్యంలోనూ పసుపు కీలక పాత్ర వహిస్తుంది. చర్మానికి సరికొత్త కాంతినివ్వడంతో పాటు, చలికాలంలో వచ్చే స్కిన్ డ్రైనెస్ నుండి తప్పించుకునేందుకు పసుపును (Turmeric Home Remedy)కొబ్బరి నూనెతో కలిపి ఉపయోగిస్తే, చక్కని ఫలితం ఉంటుంది.
Also Read: Samantha Special Song, సన్నీలియోన్‌తో పోలికా.?
చివరిగా.. వంటింటి చిట్కాలు చిన్న చిన్న సమస్యలకు తేలికైన పరిష్కారాలు చూపుతాయి. అయితే, ఏ చిట్కా విషయంలో అయినా వైద్య సలహా తీసుకోవడం అత్యుత్తమం. ఎందుకంటే, మనం వాడే ప్రతి వస్తువూ కల్తీ అయిపోతోంది.. వంటింటి చిట్కాల్లో ఈ కల్తీ సరుకు తెచ్చే అనర్థాలు తక్కువేం కాదు సుమీ.. జర జాగ్రత్త.