Home » తమిళ హీరో విజయ్ పొలిటికల్ విడాకులు.! టీవీకేకి షాక్.!

తమిళ హీరో విజయ్ పొలిటికల్ విడాకులు.! టీవీకేకి షాక్.!

by hellomudra
0 comments
Vijay TVK

TVK Vijay Divorce Politics.. తమిళ హీరో విజయ్‌కి భార్య సంగీత నుంచి షాక్ తగిలింది. ఇదేమీ ఊహించని వ్యవహారం కాదు. విజయ్‌కి ముందే తెలుసు.!

ఎందుకంటే, గత కొంతకాలంగా విజయ్, సంగీత మధ్య గొడవలున్నాయి. వైవాహిక జీవితంలో గొడవలు మామూలే.

కాకపోతే, విజయ్ రాజకీయాల్లోకి వచ్చి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న సమయంలో, అతని భార్య సంగీత, తన భర్తతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడమే ఆసక్తికరం.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 180 సీట్లకు పైగా గెలుస్తామని విజయ్ అంటున్నారు. అయితే, ఆ పరిస్థితులు మాత్రం కనిపించడంలేదు.

మొన్నటికి మొన్న విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదలకు నోచుకోకుండా పోయింది. సంక్రాంతికి విడుదలవ్వాల్సిన సినిమా, సెన్సార్ వివాదాలతో ఆగిపోయింది.

TVK Vijay Divorce Politics.. జయ నాయగన్‌కి అడ్డు తగిలిన రాజకీయం..

‘జన నాయగన్’ సినిమాకి తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే అడ్డు పుల్ల వేసిందనే ప్రచారమొకటి జరుగుతోంది. ఇప్పుడు విడాకుల కోసం విజయ్ సతీమణి కోర్టుకెక్కడం వెనుక కూడా రాజకీయ కోణమే వుందా.?

రాజకీయ నాయకులకు వ్యక్తిగత వివాదాలు తలనొప్పులుగా మారడం అనేది రాజకీయాల్లో తరచూ చూస్తూనే వుంటాం.

కాగా, తమిళనాడుని ఉద్ధరించడం సంగతి తర్వాత, ముందైతే త్రిష ఇంట్లోంచి బయటకు రావాలంటూ విజయ్‌ని ఉద్దేశించి ఓ రాజకీయ ప్రముఖుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

తన పేరుని రాజకీయాల్లోకి లాగడమేంటంటే, త్రిష సదరు రాజకీయ నాయకుడికి లీగల్ నోటీసులు కూడా పంపడం గమనార్హం. దాంతో, ఆ రాజకీయ ప్రముఖుడు త్రిషకి క్షమాపణ చెప్పారు.

ఇంతలోనే, ఈసారి విజయ్ సతీమణి నుంచే విజయ్‌కి విడాకుల తలనొప్పి ఎదురయ్యింది. తన ఫిర్యాదులోనూ, ఇంకో మహిళతో విజయ్ వుంటున్నారని, తనను వేధిస్తున్నారని విజయ్ సతీమణి సంగీత ఆరోపించారు.

ఆ మహిళ ఓ సినీ నటి.. అని కూడా విజయ్ సతీమణి తన ఫిర్యాదులో ఆరోపించడం గమనార్హం. ఆ నటి పేరుని మాత్రం సంగీత ప్రస్తావించలేదు.

ఇంతకీ, విడాకుల విషయమై విజయ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group