Twitter Bird Was Fired.. అయిపోయింది.. అంతా అయిపోయింది.! ట్విట్టర్ తన ఉనికిని కోల్పోయింది.! ట్విట్టర్ అనగానే, ముందుగా మనకి గుర్తుకొచ్చే పిట్ట ఇప్పుడు లేదు.!
ప్రపంచ కుబేరుడు, దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ చేతికి చిక్కాక, ట్విట్టర్ పిట్ట పరిస్థితి ఎలా వుండబోతోందో ముందే అంతా అంచనా వేశారు.
ట్విట్టర్ సంస్థ నుంచి చాలామంది ఉద్యోగుల్ని ఇప్పటికే పీకి పారేసిన ఎలాన్ మస్క్ (Elon Musk), తాజాగా ట్విట్టర్ పిట్టని కూడా బయటకు పంపేశాడు.!
Twitter Bird Was Fired.. పిట్ట స్థానంలో ఎక్స్..
పాపం.. ట్విట్టర్ (Twitter) పిట్ట.! స్వేచ్ఛ లభించిందని అనుకోవాలా.? అంతేనేమో.! ఆ ట్విట్టర్ పిట్ట స్థానంలో ‘ఎక్స్’ వచ్చి చేరింది.
మస్కు మామ దెబ్బకి.. పిట్ట ఎగిరిపోయింది.!
కాదు కాదు, పిట్టకు స్వేచ్ఛ లభించింది.!
ఎన్ని మార్పులు.. ఎన్నెన్ని మార్పులు.. ఇంకా ఇంకా రాబోతున్నాయ్.!
ఎలాన్ మస్క్ తలచుకుంటే.. ఏదైనా మారిపోతుంది.!
Mudra369
స్పేస్-ఎక్స్.. అన్నట్టు, ఇప్పుడు సోషల్ మీడియాలో ట్విట్టర్‌కి బదులు ‘ఎక్స్’ అన్నమాట.! ఎక్స్ లోగో ఏమంత ఎట్రాక్టివ్‌గా లేదు.
ఔను.! ట్విట్టర్ పిట్ట (Twitter Bird) అంటే అదొక ఎమోషన్.! అందుకే, మీమ్స్ పోటెత్తుతున్నాయ్.. వందల్లో.. వేలల్లో కాదు.! లక్షల్ల్లో, కోట్లల్లో.!
థ్రెడ్స్ వుందిగా..
గత కొద్ది రోజులుగా ‘థ్రెడ్స్’ తన పాపులారిటీని పెంచుకుంటోంది. దాదాపు ట్విట్టర్ లక్షణాలతో.. ఇంకాస్త మెరుగ్గా, ‘మెటా’ సంస్థ నుంచి ఈ ‘థ్రెడ్స్’ వచ్చింది.
Also Read: Mummy Cat Baby Monkey: పిల్లి కడుపున కోతి! జీవన సిత్తరం!
సో, ట్విట్టర్ నుంచి చాలామంది ఇప్పటికే బయటకు వెళ్ళిపోయారు.. వినియోగదారుల సంగతి ఇది.!
నచ్చని ట్వీట్లను ట్విట్టర్ పిట్ట వేసే రెట్టలుగా అభివర్ణించే నెటిజనం.. ఆ పిట్ట లేకపోయేసరికి.. ఒకింత ఆవేదన వ్యక్తం చేయడంలో వింతేముంది.?
అయినా, వేలాది మంది ఉద్యోగుల్ని పీకేసినోడికి.. ఓ పిట్టని లేపెయ్యడం పెద్ద కష్టమా.? దటీజ్ మస్క్.! మస్క్ ఏమైనా చేయగలడు.! చేసి చూపిస్తున్నాడు కూడా.!