Uday Kiran Death Mystery.. యువ నటుడిగా ఎన్నో సంచలనాలకు తెరలేపాడు ఉదయ్ కిరణ్. దురదృష్టవశాత్తూ అనుమానాస్పద రీతిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మెగాస్టార్ చిరంజీవికి అల్లుడు కావాల్సినోడు.! కానీ, చివరి నిమిషంలో ‘ఆ పెళ్ళి’ రద్దయ్యింది.! ఉదయ్ కిరణ్ జీవితం కొంత మేర తెరచిన పుస్తకమే.
నిజానికి, ఎవరి జివితంలో అయినా లోటుపాట్లుంటాయ్. ఉదయ్ కిరణ్ కూడా ఇందుకు అతీతమేమీ కావు. చాలా అనుకుంటాం.. అన్నీ అనుకున్నట్టు జరగవు కదా.!
ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు.!
సినిమాల్లో అవకాశాలు తగ్గాయని బలవన్మరణానికి పాల్పడ్డాడా.? వైవాహిక జీవితంలో ఏమన్నా సమస్యలున్నాయా.? ఇలా చాలా ప్రశ్నలున్నాయ్.
నిజానికి, సినీ పరిశ్రమలో అందరూ రాణిస్తే, మెగాస్టార్లు.. సూపర్ స్టార్లు తప్ప సాధారణ స్టార్లు వుండరు. సినిమా అంటేనే మ్యాజిక్.! మెగాస్టార్ చిరంజీవికీ ఫెయిల్యూర్స్ వున్నాయ్.

కేవలం సినిమాల్లో అవకాశాలు తగ్గడం వల్లే ఉదయ్ కిరణ్ బలవన్మరణానికి పాల్పడ్డాడని అనలేం. ఆర్థిక ఇబ్బందులు, వైవాహిక జీవితంలో సమస్యలు.. ఇలా చాలా కారణాలుండొచ్చు.
Uday Kiran Death Mystery.. పోయినోళ్ళంతా మంచోళ్ళే.!
పెద్దలు ఎప్పుడో చెప్పారు.. పోయినోళ్ళంతా మంచోళ్ళేనని. వాళ్ళని అలా చూడటమే అందరికీ మంచిది. కానీ, దర్శకుడు తేజ మాత్రం, ఉదయ్ కిరణ్ మరణం వెనుక కారణాలేంటో తనకు తెలుసంటున్నాడు.
తెలిస్తే, ఆలస్యమెందుకు.. ఓ సినిమా తీసి పారెయ్యొచ్చు. లేదంటే, ఉదయ్ కిరణ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు గనుక.. ఆ కేసుకు సంబంధించి పోలీసులకు తన వద్దనున్న సమాచారాన్ని ఇవ్వొచ్చు.

కానీ, రెండూ చేయడంలేదు తేజ. ఎప్పుడో ఒకప్పుడు అన్ని విషయాలూ బయటపెడ్తాడట. నలుగురూ నవ్విపోదురుగాక ఆయనకేటి సిగ్గు.?
అన్నట్టు, తేజ కూడా ఓ సినిమా విషయంలో ఉదయ్ కిరణ్‌ని అవమానించాడన్న గాసిప్స్ అప్పట్లో వినిపించాయి. అలాగని ఉదయ్ కిరణ్ మరణానికి తేజ కారణమని చెప్పగలమా.?
Also Read: ఆల్‌రౌండర్ విశ్వక్‌సేన్.! ఆఫ్ట్రాల్ అర్జున్.! అంతేనా.?
‘ఔనన్నా కాదన్నా’ సినిమా సమయంలో ఉదయ్ కిరణ్ తన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాడంటూ తేజ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. పోయినోళ్ళ గురించి ఇలాగా మాట్లాడేది.?
తేజ పబ్లిసిటీ స్టంట్లు బాగా చేస్తాడు. ఉదయ్ కిరణ్ మరణం కూడా ఆయనకో ప్రచారాస్త్రమంతే.!