Udaykiran Death Mystery Teja.. సినీ నటుడు ఉదయ్ కిరణ్ అనుమానాస్పద స్థితిలో కొన్నేళ్ళ క్రితం బలవన్మరణానికి పాల్పడ్డాడు.!
ఒకరా.? ఇద్దరా.? సినీ రంగంలో ఎందరో తారలు వివిధ కారణాలతో బలవన్మరణాలకు పాల్పడ్డారు. అందులో కొన్ని అనుమానాస్పద మరణాలూ వున్నాయ్.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ డెత్ మిస్టరీ విషయమై ఇప్పటికీ రచ్చ జరుగుతూనే వుంది. ఆయనెందుకు ఆత్మహత్య చేసుకున్నాడో ఇప్పటికీ తెలియదు.
Udaykiran Death Mystery Teja.. ఉదయ్ కిరణ్ మరణం వెనుక..
తాజాగా దర్శకుడు తేజ, ఉదయ్ కిరణ్ (Actor Uday Kiran) ఆత్మహత్య వ్యవహారంపై స్పందించాడు. మీడియా ఆయన్ని ప్రశ్నించడంతో స్పందించక తప్పలేదు.
‘ఆ నిజం అందరికీ తెలుసు. కానీ, నాతో నిజం చెప్పించాలని అందరూ చూస్తున్నారు. నేను ఇప్పుడు చెప్పను..’ అనేశాడు తేజ.
ఈ మాట తేజ (Tollywood Director Teja) చెప్పడం ఇదే కొత్త కాదు.! గతంలోనూ పలు సందర్భాల్లో తేజ ఈ వ్యాఖ్యలు చేశాడు.
తేజకి అన్నీ తెలుసా.?
దర్శకుడు తేజకి అన్నీ తెలుసా.? అంటే, ఏమీ తెలియదనే చెప్పాల్సి వుంటుంది. దర్శకుడు తేజ – ఉదయ్ కిరణ్ కలిసి పలు సినిమాలు చేశారు.

ఓ దశలో ఉదయ్ కిరణ్‌ని తేజ కూడా దూరం పెట్టాడు. కెరీర్‌లో ఎంత వేగంగా ఎదిగాడో, అంతే వేగంగా ఉదయ్ కిరణ్ స్టార్‌డమ్ పడిపోయింది.
Also Read: Nabha Natesh iShow.. ఇటువైపు ఓ లుక్కెయ్యండ్రా బాబూ.!
ఆర్థిక ఇబ్బందులనండీ, కెరీర్ విషయంలో ఒత్తిడి అనండీ.. ఇతరత్రా కారణాలనండీ.. కారణాలేవైతేనేం.. మంచి భవిష్యత్తు వున్న యువ నటుడు అర్థాంతరంగా తనువు చాలించాడు.
అనుకోవడానికేం.. ఏవైనా అనుకోవచ్చు. నరం లేని నాలిక అంటారు కదా.! ఇదీ అంతే. భార్యతో గొడవల వల్ల.. అని కూడా అంటారు.! ఏది నిజం.?
చనిపోయిన ఉదయ్ కిరణ్‌కి తప్ప, ఉదయ్ కిరణ్ బలవన్మరణానికి కారణం ఎవరికీ తెలియదు.! తేజకీ తెలియదు. కాకపోతే, పబ్లిసిటీ స్టంట్లు చేస్తుంటాడంతే.. అన్నీ తనకే తెలుసనుకుని.!