Ugram Review ఎన్ని సినిమాలు చేసినాగానీ, తొలి సినిమా ‘అల్లరి’ తాలూకూ గుర్తింపు అయితే పోవడంలేదు ఈవీవీ సత్యనారాయణ తనయుడు నరేష్‌కి.!
నిజానికి, అదేమీ ఆషామాషీ గుర్తింపు కాదు.! కాకపోతే, ఈ మధ్య సీరియస్ సినిమాల వైపు టర్న్ అయ్యాడు అల్లరి నరేష్.
సో, పేరు ముందర ‘అల్లరి’ని కూడా వదులుకోవడమే మంచిది నరేష్‌కి.! అసలు విషయానికొస్తే, అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఉగ్రం’ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
కొన్నాళ్ళ క్రితం ‘నాంది’ సినిమా వచ్చింది. ఆ కాంబినేషన్ రిపీట్ అయ్యింది.. ‘ఉగ్రం’ రూపంలో.!
ఈసారి కూడా సీరియస్ సబ్జెక్టునే ఎంచుకున్నారు దర్శకుడు విజయ్ కనకమేడల, హీరో అల్లరి నరేష్. మిర్నా మీనన్ ఈ ‘ఉగ్రం’ సినిమాలో హీరోయిన్.
‘నాంది’లో హీరో.. పోలీసుల కారణంగా బాధితుడవుతాడు. ఇందులో హీరోనే పోలీస్.!
Ugram Review.. ‘ఉగ్రం’ కథేంటంటే..
కథలోకి వెళితే, నలుగురు జులాయిల్ని పట్టుకుని లోపలేస్తాడు హీరో.. ఆ జులాయిలు, జైలు నుంచి విడుదలై పోలీసు కుటుంబంపై దాడికి యత్నిస్తారు.
ఆ జులాయిల్లో ముగ్గుర్ని మట్టుబెడతాడు హీరో. ఒకడు తప్పించుకుంటాడు. కొన్నాళ్ళ తర్వాత ఓ యాక్సిడెంట్ జరుగుతుంది హీరోకి.

ఆ యాక్సిడెంట్‌లోనే హీరోగారి భార్య, కుమార్తె మిస్ అవుతారు. వారి ఆచూకీ కనుగొనడం మిగతా కథ.!
ఇదొక యాక్షన్ థ్రిల్లర్.! అల్లరి నరేష్ గత చిత్రాలకీ, ఈ చిత్రానికీ అస్సలు సంబంధం వుండదు. తన పాత్ర వరకూ అల్లరి నరేష్ నూటికి నూరు శాతం న్యాయం చేశాడు.
హీరోయిన్ మిర్నా మీనన్ కూడా ఓకే. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బావున్నాయ్. కానీ, ఎడిటింగ్ విషయంలోనే.. చాలా చెయ్యాల్సి వుంది.
జర జాగ్రత్త అల్లరి నరేష్.!
ఈ తరహా సినిమాలకి గ్రిప్పింగ్ కథనం వుండాలి. కానీ, ‘ఉగ్రం’ విషయంలో ఆ కథనమే మైనస్ అయ్యింది. సాగతీత చికాకు పుట్టిస్తుంది.
కథనం విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుంటే, వేరే లెవల్ సినిమా అయి వుండేది ‘ఉగ్రం’. అయినాగానీ, అల్లరి నరేష్ – విజయ్ కనకమేడల ప్రయత్నాన్ని అభినందించొచ్చు.
సీరియస్ సినిమాల వైపు టర్న్ అయిన అల్లరి నరేష్, కథల ఎంపికలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంది. ఇకపై ఆ జాగ్రత్తలు తీసుకుంటాడనే ఆశిద్దాం.
