Ulta Pulta Bigg Boss.. ఇంతకు ముందులా వుండదట.! ఈసారి ఉల్టా పుల్టా అట.! అసలేంటీ ఉల్టా పుల్టా.!
బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగులో ఏడో సీజన్ షురూ అవుతోంది. కింగ్ నాగార్జున (King Akkineni Nagarjuna) హోస్ట్‌గా కొత్త సీజన్‌కి రంగం సిద్ధమయ్యింది.
వద్దు రా బాబూ.! ముందైతే, ఆ అక్కినేని నాగార్జునని మార్చెయ్యండి.. అంటూ బిగ్ బాస్ అభిమానులు నెత్తీ నోరూ బాదుకుంటున్నా, నిర్వాహకులు ఆ ఆలోచన అయితే చేయలేదు.
Ulta Pulta Bigg Boss.. సమంత గురించి ఎందుకు అడిగావ్ నాగ్.?
విజయ్ దేవరకొండ వచ్చాడు.! నవీన్ పోలిశెట్టి కూడా వచ్చాడు.! సమంత ఎక్కడా.? అని అక్కినేని నాగార్జు, ‘ఖుషి’ హీరో విజయ్ దేవరకొండని ప్రశ్నించాడు.
ఓహో.! మాజీ కోడలైపోయింది కాబట్టి, సమంత గురించి సమాచారం నాగార్జున దగ్గర లేనట్టుంది.!
ఇంతకీ, బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) రియాల్టీ షో ఏడో సీజన్ కంటెస్టెంట్లు ఎవరు.? అబ్బో, బోల్డన్ని పేర్లు ప్రచారంలో వున్నాయ్.
ముందే లిస్టు లీక్ అయిపోవడం పరమ రొటీన్ వ్యవహారం గనుక, ఆ లిస్టు.. అందులోని పేర్ల గురించి మాట్లాడుకోవడం ప్రస్తుతం దండగ.
కొత్త టాస్కులేమైనా బిగ్ బాస్ ఆలోచించాడా.? అవే పాచిపోయిన టాస్కులతో చిరాకు పెట్టిస్తాడా.?
అన్నట్టు, ఐదో వారంలోనే హౌస్‌లోకి బిగ్ బాస్ ‘సూట్ కేసు’ పంపించేస్తాడట. ఆ డబ్బులు తీసుకుని, బయటకు వచ్చేయొచ్చునట.!
బాంబు.. తుస్సుమంది.!
నాగ్ పేల్చిన బాంబు ఇది.! షరా మామూలుగానే తుస్సుమంటుందనుకోండి.. అది వేరే సంగతి.! హౌస్‌లోకి ఉత్సాహంగా వెళతారు.. అక్కడిక, చిరాకు మొహాలు పెడతారు కంటెస్టెంట్లు.!
Also Read: పాపా.! రాజమౌళి దృష్టిలో పడ్డావట.! నిజమేనా.?
ఎంటర్టైన్మెంట్ పేలడంలేదు.. టాస్కులు అసలే బాగోడంలేదు. పైగా, ఇప్పుడేమో ఉల్టా పుల్టా.. అంటూ ఓ పిచ్చి ప్రస్తావన.!
ఇవన్నీ ఎందుకు.? మొదటి వారాంతంలోనే, ఆ సూట్ కేసులేవో ఇంట్లోకి పంపించేస్తే.. దాదాపుగా అందరూ బయటకు వచ్చేస్తారు కదా.?
వచ్చేయాలనుంటుందిగానీ, రానివ్వరు.! అదే బిగ్ బాస్ పైత్యం.! గెట్ రెడీ..!