Unstoppable Shannu.. ‘అరే ఏంట్రా ఇదీ..’ ఈ మాటతో షన్నూ అలియాస్ షణ్ముఖ్ జశ్వంత్ సోషల్ మీడియాలో అబ్బో తెగ పాపులర్. యూట్యూబర్‌గా సోషల్ మీడియాలో షన్నూకి బోలెడంత ఫాలోయింగ్ ఉంది. మంచి డాన్సర్. హీరోగా పలు వీడియోలు చేశాడు. అమ్మాయిలకు డ్రీమ్ బోయ్ అయిపోయాడు. ఇదంతా ‘నీ గొట్టం’అదేనండీ.. యూ ట్యూబ్ ముచ్చట.
అయితే, ఇప్పుడు ఈ షన్నూ ఓ బిగ్‌బాస్ సెలబ్రిటీ. చాలా అంచనాలతో బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టాడు. మొదటి నుంచీ ఎందుకో బిగ్‌బాస్‌కి షణ్ముఖ్ జశ్వంత్ ఫేవరబుల్ కంటెస్టెంట్. కానీ, హౌస్‌లో మనోడు పీకిందేమీ లేదు. మోజ్ రూమ్‌లో సిరితో పెట్టే ముచ్చట్లు.. శృతిమించిన హగ్గింగులూ తప్ప.
ప్రేక్షకుల అంచనాలను ఇంచుకైనా అందుకోలేకపోయాడు షన్నూ. వీక్షకుల సహనాన్ని పరీక్షించేశాడు. ఇక ఇప్పుడు.. షో సివరాఖరికి చేరుకుంది. అయినా షన్నూ నుంచి నో న్యూ డెవలప్‌మెంట్.
Unstoppable Shannu అరే ఏంట్రా ఈ ట్రెండింగ్.?
అయితే, ‘అన్‌స్టాపబుల్ షన్నూ’ అంటూ సోషల్ మీడియాలో ఈ మధ్య తెగ ట్రెండింగ్ అయిపోయాడు షన్నూ అలియాస్ షణ్ముఖ్ జశ్వంత్. ఈ హ్యాష్ ట్యాగ్‌తో ఏకంగా వన్ మిలియన్ పైగా ట్వీట్లు కొట్టేశాడు. ఏంటిదంతా.? ప్రమోషనే. అవును ఖచ్చితంగా ప్రమోషనే.

ఇంతవరకూ బిగ్‌బాస్ హిస్టరీలోనే ఈ రేంజ్ ప్రమోషన్లు చేసింది ఎవరూ లేరని అంతా షాకవుతున్నారు. గత సీజన్‌లో అఖిల్, అభిజీత్‌లు కూడా ఇలాగే ప్రమోషన్లు చేయించుకున్నారు. కానీ, వాళ్లందరినీ మించి పోయాడీ మిస్టర్ షన్నూ. మరీ ఇంత ప్లానింగా.? అని ఆశ్చర్యపోవడమే అందరి వంతవుతోంది.
ఇంత ప్రమోషన్‌కి ఎంత ఖర్చయ్యిందో.?
గత సీజన్‌లో కౌషల్ ఆర్మీ పేరుతో ఈ పబ్లిసిటీ స్టార్ట్ అయ్యింది. అయితే, కౌషల్ విషయంలో అప్పుడు అనూహ్యంగా మొదలైన ట్రెండ్ అది. ఆ తర్వాత ‘పెయిడ్ ప్రమోషన్’ రూపంలో ఆ ట్రెండ్ అలా కంటిన్యూ అవుతూ వస్తోంది. మరి, ఈ ప్రమోషన్స్‌కి ఏ రేంజ్‌లో ఖర్చు పెడుతున్నారు మన బిగ్‌బాస్ కంటెస్టెంట్లు.? ఏమో వారికే తెలియాలి.
Also Read: Pooja Hegde, Kajal Aggarwal..కైపెక్కిస్తున్న చక్కని ‘చుక్క’లు.!
సరే, అయితే.. షన్నూ టైటిల్ విన్నర్ అయిపోతాడా ఏంటీ.? ఏమో అదీ చెప్పలేం. ఒకవేళ అయితే, బిగ్‌బాస్ టైటిల్‌కి మిస్టర్ షన్నూ యాప్ట్ అనగలమా.? ఖచ్చితంగా అనలేం. కానీ, ప్రమోషన్స్ విషయానికి వస్తే మాత్రం మిస్టర్ షన్నూ (Unstoppable Shannu) టాప్ అంతే.