ఇకపై ఊర్వశి రౌతెలా (Urvashi Rautela Kick Boxing Spicy Action Queen) అంటే కేవలం కిక్కెక్కించే గ్లామర్ మాత్రమే కాదు. పవర్ ‘కిక్’ ఇచ్చే యాక్షన్ క్వీన్ కూడా. ఔను, ఆమె కిక్ బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంది. వెండితెరపై ఎడా పెడా యాక్షన్ సీక్వెన్సుల్లో కనిపించేస్తానంటోంది ఊర్వశి రౌతెలా ఇకపైనుంచి. అలాగని గ్లామరస్ పాత్రలు మానెయ్యదట.
‘నటిగా అన్ని రకాల పాత్రలూ చేసి, ప్రేక్షకుల మెప్పు పొందినప్పుడే అసలు సిసలు కిక్కు లభిస్తుంది. అందుకే, కిక్ బాక్సింగ్ నేర్చుకుంటున్నాను..’ అంటూ ఊర్వశి రౌతెలా తన తాజా ఇంటర్వ్యూలు చెప్పింది. మొదట్లో కిక్ బాక్సింగ్ నేర్చుకోవడం చాలా కష్టంగా అనిపించిందట ఆమెకి. అయితే, ఆ తర్వాత అదో అడిక్షన్‌గా మారిపోయిందని ఈ బ్యూటీ చెబుతోంది.
కిక్ బాక్సింగ్‌తో ఫిట్‌నెస్ లెవల్స్ కూడా పెరుగుతాయని అంటోన్న ఊర్వశి రౌతెలా (Urvashi Rautela Kick Boxing Spicy Action Queen), స్విమ్మింగ్.. జాగింగ్.. ఇతర వర్కవుట్లలానే కిక్ బాక్సింగ్‌ని కూడా రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తే ఫిట్‌గా వుండొచ్చనీ, అతివల ఆత్మవిశ్వాసాన్ని కిక్ బాక్సింగ్ పెంచుతుందనీ చెప్పుకొచ్చింది.
ఊర్వశి రౌతెలా హిందీలో పలు ప్రతిష్టాత్మక సినిమాల్లో నటిస్తూనే, సౌత్ సినిమాపైనా ఫోకస్ పెట్టింది. తెలుగులో ఆమె ‘బ్లాక్ రోజ్’ (Urvashi Rautela Black Rose) అనే సినిమాలో నటిస్తోన్న విషయం విదితమే. ఇక, కిక్ బాక్సింగ్‌లో ఆరి తేరిన బ్యూటీస్ లిస్టు తీస్తే, అగ్రస్థానం మాత్రం దిశా పటానీదే. బాయ్‌ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ శిక్షణలో దిశా పటానీ ఆరి తేరింది కిక్ బాక్సింగ్ చేయడంలో.