Ustaad Bhagat Singh.. కంటెంట్ వున్నోడి కటౌట్ చాలు.! ఇది ‘గబ్బర్ సింగ్’ సినిమాలోని డైలాగ్.! ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరో.! దర్శకుడేమో హరీష్ శంకర్.!
పవన్ కళ్యాణ్‌కి (Power Star Pawan Kalyan) వీరాభిమాని హరీష్ శంకర్ (Director Harish Shankar). అభిమాని.. అనడం కంటే, భక్తుడు.. అనడం కరెక్టేమో.!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Jana Senani Pawan Kalyan) కొత్త సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఎప్పుడో ప్రారంభమవ్వాల్సిన సినిమా ఇది. అనివార్య కారణాల వల్ల సినిమా సెట్స్ మీదకు వెళ్ళడం ఆలస్యమవుతూ వచ్చింది.
Ustaad Bhagat Singh.. ఊచకోత మొదలైంది..
చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers), చాలా ఏళ్ళుగా ఈ సినిమా నిర్మాణం కోసం ఎదురుచూస్తూ వచ్చింది.
జనసేన అధినేతగా రాజకీయాల్లో బిజీగా వుండడం వల్ల, మైత్రీ మూవీ మేకర్స్‌లో చేయాల్సిన సినిమాని పవన్ కళ్యాణ్ కాస్త ఆలస్యంగా లైన్లో పెట్టాల్సి వచ్చిన విషయం విదితమే.
Also Read: సల్మాన్, పూజా హెగ్దేతో రామ్ చరణ్ ‘మాస్’ లుంగీ డాన్స్.!
ఎలాగైతేనేం, ఆ రోజు రానే వచ్చింది. సినిమా షూటింగ్ ప్రారంభమైపోయింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడిస్తూ, ‘ఉస్తాద్ ఊచకోత షురూ..’ అని పేర్కొంది.
ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు.. అంటూ పోస్టర్ మీద స్పష్టతనిచ్చారు. అంటే, అంతకు మించి.. ఏముంటుందబ్బా.? అది సినిమా చూస్తేనే తెలుస్తుంది.