Ustaad OG Bhagat Singh.. రాజకీయ పర్యటనల్లో భాగంగా పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ‘ఓజీ’ హీట్‌ని ఎదుర్కొన్నారు.! అభిమానులపై ఒకింత విసుక్కున్నారు కూడా.!
కానీ, ఆ అభిమానమేంటో పవన్ కళ్యాణ్‌కి బాగా తెలుసు. కాకపోతే, సందర్భం అది కాదంటూ అభిమానుల్ని వారించే క్రమంలో ఒక్కోసారి చిరుకోపం ప్రదర్శించేవారు పవన్ కళ్యాణ్.
‘హరి హర వీర మల్లు’ సినిమా సమయంలో కూడా అభిమానులు ‘ఓజీ’ గురించే ఎక్కువ మాట్లాడారు. ‘ఓజీ’ మీద పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ స్థాయి అంచనాలు పెట్టుకున్నారు.
‘ఓజీ’ వచ్చేసింది.. సంచలన విజయాన్నీ అందుకుంది. అభిమానుల దాహం తీరిపోయింది.! ఇక, ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తొలుత, ‘భవదీయుడు భగత్ సింగ్’ అనుకున్నారు.
Ustaad OG Bhagat Singh.. టైటిల్ మారింది.. కథ కూడా మారింది.!
కానీ, టైటిల్ మారింది.. కథ కూడా మారింది.! కొత్తగా, సరికొత్తగా పవన్ కళ్యాణ్‌ని ప్రెజెంట్ చెయ్యడానికి హరీష్ శంకర్ సమాయత్తమయ్యాడు.
ఎలా వుండబోతున్నాడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’.? అంటే, ఇదిగో.. ఇలా వుంటాడు.. అంటూ, ‘దేఖ్లేంగే’ సాంగ్ వదిలారు దర్శక నిర్మాతలు.
‘దేఖ్లేంగే’ సాంగ్, మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబడుతోంది. పవన్ కళ్యాణ్ డాన్స్, ఈ పాటకి ప్రధాన ఆకర్షణ. చాలాకాలమయ్యింది పవన్ కళ్యాణ్ ఇంత హుషారుగా డాన్స్ చేసి.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’లోని ‘దేఖ్లేంగే’ పాటని సమ్‌థింగ్ స్పెషల్‌గా మార్చేశాయ్.
నిజానికి, పవన్ కళ్యాణ్ అభిమానులు తమ అభిమాన నటుడు రాజకీయాల్లో బిజీ అయిపోయాక, ఆయన్నుంచి డాన్సులు పెద్దగా ఆశించట్లేదు.
అయినాగానీ, అభిమానుల కోసం పవన్ కళ్యాణ్ స్టెప్పులేశారు. దాంతో, ‘ఓజీ’ని మించి, ‘ఉస్తాద్ గబ్బర్ సింగ్’ వుంటుందని అభిమానులు ఇప్పుడు బలంగా నమ్ముతున్నారు.
ఉస్తాద్ ఓజీ భగత్ సింగ్.. అంటూ, పవన్ కళ్యాణ్‌ని అభిమానులు పిలుచుకుంటున్నారు ముద్దుగా.!
