Vaishnavi Chaitanya Love Me.. వైష్ణవీ చైతన్య.. అంటే ఓ యూ ట్యూబర్గానే పరిచయం. కానీ, ‘బేబీ’ సినిమా తర్వాత ఆమె కెరీర్ మారిపోయింది. డెబ్యూ మూవీతోనే ఇండస్ట్రీ దృష్టిని విశేషంగా ఆకర్షించింది.
తొలి సినిమా ‘బేబీ’తో సంచలన విజయం అందుకున్న వైష్ణవీ చైతన్య (Vaishnavi Chaitanya) రెండో ఛాన్స్ రాలేదా.? అంటే ఎందుకు రాలేదు.. బోలెడన్ని ప్రాజెక్టులు ఓకే చేసి పెట్టేసింది.
అంతేకాదు, టాలీవుడ్ టాప్ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు బ్యానర్లో సైతం ఛాన్స్ కొట్టేసింది వైష్ణవీ చైతన్య. ఆ సినిమా లేటెస్ట్గా సెట్స్ మీదికి వెళ్లింది కూడా.
Vaishnavi Chaitanya Love Me.. ‘బేబీ’కి క్యూ కడుతున్న ఆఫర్లు..
‘లవ్ మి’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్నాడు. అరుణ్ భీమవరపు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
‘బేబీ’కి ముందు కూడా ఓ వైపు యూ ట్యూబ్ వీడియోలు చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ చిన్న చిన్న రోల్స్ పోషించిన వైష్ణవికి ‘బేబీ’తో హీరోయిన్ ఛాన్స్ దక్కింది.
హీరోయిన్గా తొలి అడుగులోనే బంపర్ విజయం అందుకోవడంతో పిచ్చ పిచ్చగా క్రేజ్ దక్కించుకుంది వైష్ణవీ చైతన్య. అలాగే, తొలి సినిమా హీరో ఆనంద్ దేవరకొండతోనే మరో సినిమాకీ సైన్ చేసింది చలాకీ పిల్ల వైష్ణవి.
స్లో అండ్ స్టడీ బేబీ.!
అలాగే మరికొన్ని ఆఫర్లు ఆమె వెంట పడుతున్నాయట. అయితే, ఆచి తూచి కెరీర్‌ని బిల్డప్ చేసుకుంటోంది వైష్ణవీ చైతన్య (Vaishnavi Chaitanya).
ఎలాంటి రోల్ అయినా హ్యాండిల్ చేయగల సత్తా వున్న నటి వైష్ణవీ చైతన్య. గ్లామర్‌లో ఎలాంటి హద్దుల్లేవ్. డెబ్యూ మూవీతోనే అది ప్రూవ్ చేసుకుంది.
Also Read: ఘాటైన గుంటూరు కారం.! ఇది కదా కావాల్సింది.!
సో, సరైన సక్సెస్ రావాలే కానీ, వైష్ణవి చైతన్య వంటి టాలెంట్ వున్న ముద్దుగుమ్మలకి టాలీవుడ్లో ఎప్పుడూ మంచి ఆదరణే దక్కుతుంది. లక్కు కూడా కలిసొచ్చింది కాబట్టే, ‘బేబీ’ బంపర్ హిట్ అయ్యింది.!
ఈసారి ఓ మోస్తరు పెద్ద సినిమా పడితే.. కమర్షియల్ హీరోయిన్గా వైష్ణవి చైతన్య తనను తాను ప్రూవ్ చేసుకోగలిగితే.. ఇక ఆమెకి తిరుగే వుండదంతే.!