జీన్స్ ధరించి నిద్రపోతున్నారా.? ‘తేడా’ వచ్చేస్తది జర జాగ్రత్త.!

 జీన్స్ ధరించి నిద్రపోతున్నారా.? ‘తేడా’ వచ్చేస్తది జర జాగ్రత్త.!

Anu Kreethy Vas

Sleep With Jeans Problems.. నిద్ర పోయేటప్పుడు టైట్ ఫిట్స్ లేదా దళసరి దుస్తులు ధరించి నిద్రిస్తే చాలా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశమున్నట్లు నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా జీన్స్ ధరించి నిద్రపోయే అలవాటున్నట్లయితే వెంటనే మానుకోవాలని హెచ్చరిస్తున్నారు.

జీన్స్‌ని డెనిమ్ క్లాత్‌తో తయారు చేస్తారు. ఈ క్లాత్ చెమటని పీల్చుకోదు. తద్వారా అనేక రకాల ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదముంది.

ప్రత్యుత్పత్తి సమస్యలు

జీన్స్ ధరించి పడుకోవడం వల్ల తలెత్తే అత్యంత ప్రమాదకరమైన సమస్యల్లో ఒకటి ప్రత్యుత్పత్తి సమస్య.

జీన్స్‌తో నిద్ర పోవడం వల్ల కండరాలు పట్టేస్తాయ్. తద్వారా ప్రత్యుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Deviyani Sharma Sleep With Jeans Problems
Deviyani Sharma

మగవారిలో అయితే, షెర్టిలిటీ రేటు తగ్గే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

అలాగే ఆడవారిలో జననాంగం, పొత్తి కడుపు, గర్భాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా పీసీఓడీ తదితర పీరియడ్స్ సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయ్.

Also Read: పులస పాతిక వేలు.! ఈ ‘చేప’ని తినని జన్మెందుకు.?

అంతేకాదు, కడుపు నొప్పి, అజీర్తి వంటి జీర్ణ సమస్యలకూ టైట్ ఫిట్స్‌తో నిద్ర పోయే అలవాటు ఓ కారణం కావచ్చని చెబుతున్నారు.

Sleep With Jeans Problems.. రక్త ప్రసరణ సమస్యలు..

జీన్స్ ధరించి నిద్ర పోవడం వల్ల రక్త ప్రసరణ సరిగా జరగదు. దాంతో, కండరాల నొప్పులు, కండరాల్లో తిమ్మిర్లు సంభవిస్తాయ్.

Jeans Sleaping
Jeans Sleaping

మలబద్ధకం సమస్యలు కూడా ఎక్కువే. నిద్ర సరిగా పట్టకపోవడంతో చికాకు, అసహనం వంటి మానసిక సమస్యలు కూడా తలెత్తే ప్రమాదముంది.

కేవలం జీన్స్ మాత్రమే కాదండోయ్, టైట్ ఇన్నర్ వేర్స్ ధరించి నిద్రపోవడం వల్ల కూడా ఆయా అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Aanchal Munjal
Aanchal Munjal

సో, నిద్రపోయే ముందు బిగుతుగా వున్న దుస్తుల్ని తీసేసి, లూజ్‌గా గాలి తగిలేలా శరీరానికి సౌకర్యంగా వుండే దుస్తుల్ని ధరించి నిద్ర పోవాలి.

గమనిక:

ఇంటర్నెట్‌లో అందుబాటులో వున్న సమాచారం ప్రకారం కొందరు వైద్య నిపుణుల సూచనలు సలహా ప్రకారం ఈ సమాచారం సేకరించడమైంది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Digiqole Ad

Related post