Vaishnavi Chaitanya Verbal Vulgarity.. వైష్ణవీ చైతన్య.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ‘బేబీ’ అనే సినిమాతో సింగిల్ నైట్ స్టార్ అయిపోయిందీ ముద్దుగుమ్మ.
అంతవరకూ కేవలం సోషల్ మీడియాకే సెన్సేషన్ అయిన ఈ అందాల భామ వెండితెరపై ఓ సెన్సేషన్ అయిపోయింది.
మెగాస్టార్ చిరంజీవితోనే ‘సహజ నటి’ అని ప్రశంసలు అందుకుంది.. అంటే వైష్ణవీ చైతన్య టాలెంట్అ అలాంటిలాంటిది కాదని ఒప్పుకుని తీరాల్సిందే.
Vaishnavi Chaitanya Verbal Vulgarity.. తూచ్.! తప్పులో కాలేసింది.!
తొలి సినిమా ‘బేబీ’ సూపర్ సెన్సేషనల్ తర్వాత ‘లవ్ మీ – ఇఫ్ యు డేర్’ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా అంతంత మాత్రమే అయినా వైష్ణవీ చైతన్య క్రేజ్ మాత్రం మామూలుగా లేదు.
ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతోన్న ‘జాక్’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.
ఈ సినిమా ప్రమోషన్లలో వైష్ణవీ చైతన్య జోరుగా పాల్గొంటోంది. యూత్ టార్గెట్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అసలు మ్యాటర్ ఏంటంటే.! ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వైష్ణవీ చైతన్య భీమవరంలో ఓ ప్రోగ్రామ్‌కి అటెండ్ అయ్యింది.
అక్కడ మాటల్లో పొరపాటుగా రాజమండ్రి అభిమానులు అని ప్రస్థావించగా . ఆడియన్స్ నుంచి అబ్జెక్షన్స్ రావడంతో సారీ.. అనే పదానికి బదులు ( F.. ) బూతు పదాన్ని వాడేసింది.
దాంతో, సోషల్ మీడియాకి టార్గెట్ అయిపోయింది వైష్ణవీ చైతన్య. అసలే వైష్ణవిపై అనేక విమర్శలున్నాయ్ సోషల్ మీడియా వేదికగా.!
అడ్డంగా బుక్కయిపోయావేంటి బేబీ.!
ఈ నేపథ్యంలో ఇలాంటి పొరపాటు చేస్తే ఎలా బేబీ.! అంటూ ఆమె అభిమానులే చెవులు కొరుక్కుంటున్నారు. అయితే అలవాటులో పొరపాటుగా వచ్చేసిన మాట అది.
ఎంత అలవాటులో పొరపాటు అయితే మాత్రం పబ్లిక్‌లోకి వచ్చేటప్పుడు కాస్త అలర్ట్‌గా వుండాలిగా బేబీ.! సోషల్ మీడియా వేదికగా ఇఫ్పుడిదే చర్చ. ఫుల్లుగా ఆడేసుకుంటున్నారు.
Also Read: వదిలేసిన రష్మిక.! ఒడిసిపట్టిన శ్రీలీల.! ఇద్దరికీ తప్పలేదు.!
సరె సర్లే.. ఏదో పొరపాటుగా వచ్చేసిన మాట.. వివాదాస్పదమైపోయింది. నెట్టింట వైరల్‌గానూ మారిపోయింది. సినిమాకి ఇదే ఇప్పుడు పెద్ద పబ్లిసిటీ అయిపోయింది.
మరి, ఈ వైరల్ పబ్లిసిటీ సినిమాకి ఏమైనా యూజ్ అవుతుందా.? లెట్స్ వెయిట్ అండ్ సీ.!