ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? అసలు మళ్ళీ సినిమాలు చేస్తాడా.? చెయ్యడా.? అన్న సస్పెన్స్ వీడి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఓ సినిమా వచ్చేస్తోంది. అదే ‘వకీల్ సాబ్’. ప్రస్తుతానికి ఈ సంక్రాంతికి ‘టీజర్’తో సరిపెట్టుకోమంటున్నాడు ‘వకీల్ సాబ్’ (Vakeel Saab Teaser Power Of Pawan Kalyan). కష్టం.. మామూలు కష్టం కాదు, చాలా చాలా కష్టమిది పవన్ కళ్యాణ్ అభిమానులకి.
తెరపై పవన్ కళ్యాణ్‌ని ‘వకీల్ సాబ్’గా (Vakeel Saab Teaser Review) చూడాలని కళ్ళు కాయలు కాచేలా అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ‘వకీల్ సాబ్’ టీజర్ వచ్చేసింది. ‘ఇది ఓ చిన్న సినిమా లాంటిది..’ అనే భావన పవన్ అభిమానుల్లో వ్యక్తమవుతోందంటే, తమ అభిమాన హీరో కోసం అభిమానులెంతలా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
‘అబ్జెక్షన్..’ అంటూ పవన్ కళ్యాణ్ నుంచి ఓ మాట ఇలా వచ్చిందో లేదో.. తాము ఇంట్లో వున్నామన్న సంగతి మర్చిపోయి, థియేటర్లలో వున్నామన్న భ్రమతో అభిమానులు ఈలలు, గోలలు చేసేశారు. దటీజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రౌడీల్ని ‘వకీల్ సాబ్’ కొడుతోంటే, ఆ పవర్‌ని అభిమానులు ఫీలవుతున్నారు.
Vakeel Saab Teaser Review Power Star Pawan Kalyan
ఔను, ఆయన ‘చేతి దెబ్బ’లో ఎంత పవర్ వుంటుందో, అంతకంటే ఎక్కువ పవర్, ఆయన కళ్ళల్లో వుంటుంది మరి. తమన్, ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేసినట్టున్నాడు.. ఆ స్థాయిలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. టీజర్‌కి హైలైట్‌గా నిలిచింది.
మెట్రో రైల్‌లో ఫైట్.. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ స్టయిలింగ్.. కోర్టు హాల్‌లో వకీల్ సాబ్.. ఈ క్రమంలో పవన్ బాడీ లాంగ్వేజ్.. ఇవన్నీ ఓ ఎత్తు అయితే.. చివర్లో ఓ వాహనం మీద తన సామాన్లతో ‘వకీల్ సాబ్’ వెళుతున్న వైనం.. ఈ టీజర్‌కే హైలైట్.
వేణు శ్రీరామ్ ఈ ‘వకీల్ సాబ్’కి దర్శకుడు కాగా, దిల్ రాజుతోపాటు బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతిహాసన్, నివేదా థామస్ తదితరులు ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. బాలీవుడ్ సినిమా ‘పింక్’కి ఇది తెలుగు రీమేక్. తెలుగు వెర్షన్ కోసం చాలా మార్పులు చేశారట.. అవేంటన్నది తెరపైనే చూడాలి.
చివరగా మళ్ళీ ఇంకో మాట.. అదే, ‘వెయిటింగ్ చాలా కష్టం పవర్ స్టారూ.!’. కరోనా దెబ్బ కొట్టింది కాబట్టి ఇంత లేటు.. లేకపోతే, గత ఏడాదే ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చేసి వుండేది. లేట్ అయితేనేం.. పవన్ కళ్యాణ్ ‘పవర్’ (Vakeel Saab Teaser Power Of Pawan Kalyan) మొత్తం ‘వకీల్ సాబ్’ టీజర్‌లోనే కన్పించేసింది. అభిమానులకు ఇంతకన్నా ఇంకేం కావాలి.?