వాలెంటైన్స్ డే.. (Valentines Day) ప్రేమికుల రోజు.. (Lovers Day) ఇది ప్రేమికులకి చాలా చాలా ప్రత్యేకమైన రోజు. అసలు ప్రేమించడం ఎలా.? ఈ రోజుల్లో ప్రేమ అంటే తెలియనిదెవరికి.? (Valentines Day Lovely Lessons) కంటికి ఇంపుగా అవతలి వ్యక్తి కనిపిస్తే చాలు, తొలి చూపులోనే ప్రేమ పుట్టేస్తుంది.
కాదు కాదు, అవతలి వ్యక్తిలోని మంచి గుణాలు నచ్చితే.. తొలుత ఆ వ్యక్తి మీద అభిమానం ఏర్పుడుతుంది, ఆ తర్వాత అది ప్రేమగా (Love) మారేందుకు ఆస్కారమేర్పడుతుంది. ఒకప్పటి ప్రేమ కథలు వేరు. ఇప్పటి ప్రేమ కథలు వేరు. చూడటం, ఇష్టపడటం, లిప్ టు లిప్ కిస్ లాగెయ్యడం.. ఇదంతా కొన్ని రోజుల్లోనే, కాదు కాదు కొన్ని గంటల్లోనే, కాదు కాదు కొన్ని నిమిషాల్లోనే జరిగిపోతోంది.
ప్రేమ గురించి చరిత్రలో చాలామంది కవులు చాలా చాలా గొప్పగా చెప్పారు. ఎన్నెన్నో గొప్ప పాటలు (Love Songs) కూడా రాశారు. ప్రేమ పాటలకి వుండే క్రేజ్ అంతా ఇంతా కాదు.
ప్రేమ ఎంత మధురం.. (Valentines Day Lovely Lessons)
కానీ, ఇప్పుడు ఆ ప్రేమ పాటల్లో భావం ఎవరికీ అవసరం లేదు. అదిరిపోయే బీట్ వుంటే చాలు.. పోనీ, ఓ మెలోడియస్ మ్యూజిక్ వున్నా సరిపోతుంది.. అందులో పదాలతో పనిలేకుండానే, దాన్ని ప్రేమ పాటలా భావించి, ప్రేమ మైకంలో మునిగిపోతున్నారు చాలామంది.
అందరూ ఇలాగే వుంటున్నారనడం కూడా సబబు కాదు. కానీ, చాలామంది ఇలాగే వుంటున్నారు. ఇంతకీ, ‘వాలెంటైన్స్ డే’ అనగానే ఏం చేస్తారు ప్రేమికులు.? అంటే, ముందుగా షాపింగ్.. అనే మాటే గుర్తుకొస్తుంది.
ఇష్టమైన వ్యక్తి కోసం, అతనికి ఇష్టమయిన బహుమతులు కొనడం ప్రేమికులకు తప్పనిసరైపోయింది. పార్కులకు మాత్రమే పరిమితమయ్యే ప్రేమికులకు ఈ బహుమతుల తలనొప్పి ఇంకాస్త ఎక్కువే.
బహుమతులతో ప్రేమలో ముంచెత్తండిక.. (Valentines Day Lovely Lessons)
నిజమైన ప్రేమికులకీ బహుమతులు తప్పవు. కానీ, ఆ బహుమతుల్లో అవతలి వ్యక్తి ప్రేమ వుంటుంది. ప్రేమించడం గొప్ప కాదు ఈ రోజుల్లో, ఆ ప్రేమని నిలబెట్టుకోవడమే చాలా కష్టమైన విషయం. ఇలా ప్రేమించి అలా విడిపోవడం లేటెస్ట్ ట్రెండ్. తమ ప్రేమ ఫలించిందని పార్టీ చేసుకుని, ఆ పార్టీ తాలూకు జోష్ ఇంకా తగ్గకుండానే, బ్రేకప్ పార్టీలకు (Break Up Parties) ప్లాన్ చేసుకుంటోంది నేటి యువత.
తప్పెవరిది.? అంటే, ఈ ట్రెండ్ అలా తగలడింది గనుక, దేన్నీ ‘తప్పు’ అనకూడదేమో. ప్రేమ పుట్టాక తలెత్తే చిన్నపాటి విభేదాలు.. బ్రేకప్ వరకూ దారి తీసినా ఫర్వాలేదేమోగానీ, ఆ ప్రేమ వికటించి.. అవతలి వ్యక్తి మీద ‘పగ’లా మారకూడదు.
వాలెంటైన్స్ డే – ప్రేమికుల రోజు.. (Valentines Day Lovers Day) పేరేదైనా, ఒక రోజు సరిపోవడంలేదు నేటి తరం ప్రేమికులకి టెడ్డీ బేర్ డే, చాక్లెట్ డే.. హగ్ డే.. ఇలా వరుస పండుగలు చేసేసుకుంటున్నారు.
ఏం, సంవత్సరమంతా ప్రేమించుకుంటే తప్పేమంటి.? ప్రేమించకపోయినా ఫర్వాలేదు, ప్రేమోన్మాదం పెంచుకోకూడదు. అది అసలు ప్రేమే కాదు.. అది జస్ట్ ఉన్మాదం మాత్రమే.