Valimai Telugu Review: ఏ సినిమా సక్సెస్ అవుతుందో, ఏ సినిమా ఫెయిల్యూర్ అవుతుందో ముందే అంచనా వేయగలిగితే, అసలు ఫ్లాప్ సినిమాలే రావు.
కానీ, కొన్ని సినిమాల విషయంలో ‘ఇలా ఎందుకు చేశారబ్బా.?’ అన్న ఆశ్చర్యం, ఆవేదన సినీ ప్రేక్షకులకి అభిమానులకి కలగడం అనేది.. ఆయా సినిమాల్ని తీసేవారి నిర్లక్ష్యమో, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనో జరుగుతుంది.
అజిత్ సినిమాలకి ఓ వేగం వుంటుంది. ఓ ప్రత్యేకత వుంటుంది. అందుకే, అజిత్ నుంచి ఏదన్నా సినిమా వస్తోందంటే, దానిపై అంచనాలు ఆకాశాన్నంటేస్తాయి. అజిత్ చాలా మంచి నటుడు. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు.
ఎందుకు అజిత్ ఇలా చేశావ్.?
అలాంటి అజిత్ నుంచి సరైన నటన రాబట్టుకోలేకపోతే.? అది ఖచ్చితంగా దర్శకుడి తప్పే.! ‘వలిమై’ సినిమా విషయంలో అదే జరిగింది. ఒక్కటంటే ఒక్క సన్నివేశంలోనూ నిఖార్సయిన అజిత్‌ని మనం చూడలేం.
సినిమాలో ఏదేదో జరుగుతుంటుంది.. కేవలం ఛేజింగ్ సీన్స్ కోసం, రేసింగ్ సీన్స్ కోసమే సినిమా తీశారా.? అనిపిస్తుంది. డ్రగ్స్ స్మగ్లింగ్, హత్యలు.. వీటి మూలాల్ని కనుగొనే పోలీసులు.. ఇలా సాగుతుంది కథ.
ముందే చెప్పుకున్నాం కదా, అజిత్ సినిమాల్లో వేగం వుంటుంది. అజిత్ సినిమాల్లో యాక్షన్ వుంటుంది. అజిత్ సినిమాల్లో హృదయాల్ని కదిలించే ఎమోషన్ కూడా వుంటుంది. కానీ, ‘వలిమై’లో దాదాపుగా ఏమీ లేవు. అసలు ఇది అజిత్ సినిమానే కాదు.!
Valimai Telugu Review ఏదీ ఆ హయ్యర్ పర్పజ్.?
రేసింగ్ సీన్స్.. అదేనండీ యాక్షన్ బ్లాక్స్ అబ్బురమే అనిపిస్తాయి. కానీ, చప్పగా సాగే కథతో ఆ హై ఆక్టేన్ ఎపిసోడ్స్ కూడా చప్పగా మిగిలిపోతాయి. ఏ క్యారెక్టరుకీ ఓ ‘హయ్యర్ పర్పస్’ అనేదే లేకుండా పోయింది.
హీరో, విలన్.. ఇలా అందరూ అంతే. వెరసి, ‘వలిమై’ సినిమా గురించి పెద్దగా మాట్లాడుకోడానికి కూడా లేకుండా పోయింది. అజిత్ గెటప్స్ కూడా అంతగా ఆకట్టుకోవంటే, సినిమాని ఎలా డిజైన్ చేసి వుంటారో అర్థం చేసుకోవచ్చు.
Also Read: Sonam Kapoor.. అలా చెప్తేనే ‘కిక్కు’ వస్తుందట.!
మన టాలీవుడ్ నటుడు కార్తికేయ సినిమా కోసం ఏమైనా చేస్తాడు. అలాంటి కార్తికేయని కూడా సరిగ్గా వాడుకోలేకపోయారు. ఖర్చు విషయంలో రాజీ పడలేదుగానీ, కథ అలాగే కథనాల విషయంలో రాజీ పడిపోయారు. అదే పెద్ద మైనస్ అయిపోయింది.
బాలీవుడ్ నటీమణులు బని విజె, హ్యమా ఖురేషీ తదితరులూ పెద్దగా చేయడానికేమీ లేదు. ఓవరాల్‌గా చూస్తే, ‘వలిమై’ అసలు అజిత్ సినిమానే కాదు.!