వాళ్ళిద్దరూ రియల్ లైఫ్‌లో భార్యా భర్తలు. తొలుత రీల్ లైఫ్ ప్రేమ.. ఆ తర్వాత నిజంగానే ప్రేమ.. అది పెళ్ళిగా మారిన వైనం.. ఇవన్నీ జరిగిపోయాయి. ఆ ఇద్దరూ ఇంకెవరో కాదు, హీరో వరుణ్ సందేశ్.. హీరోయిన్ వితికా (Varun Sandesh tho Vithika Romantic Tick) షెరు. ప్రస్తుతం బిగ్‌బాస్ రియాల్టీ షోలో (Bigg Boss Telugu Season 3) ఈ ఇద్దరూ హౌస్‌మేట్స్. దాంతో, తెలుగు బిగ్‌బాస్ రియాల్టీ షో మూడో సీజన్ కొత్త గ్లామర్ వచ్చింది.
బిగ్‌హౌస్‌లో ఈ రొమాంటిక్ కపుల్ క్యూట్ క్యూట్‌గా ఎట్రాక్ట్ చేస్తున్నారు. మూడో రోజు హౌస్‌లో ఉదయాన్నే ఈ ఇద్దరి రొమాంటిక్ మూమెంట్స్ హైలైట్‌గా నిలిచాయి.
తనకు ‘ఐ లవ్ యూ’ చెప్పలేదని వితిక అలిగితే, ‘చెప్పాను కదా’ అంటూ వరుణ్ సముదాయించడం.. ‘నన్ను ఎత్తుకుంటావా’ అని వితిక బుంగమూతి పెట్టి అడిగితే, ‘చేతులు నొప్పెడుతున్నాయి’ అని వరుణ్ అనడం.. దానికి స్పందిస్తూ, ‘అయితే నాగార్జున సర్‌కి చెబుతా వీకెండ్‌కి వస్తారు కదా’ అంటూ వితిక సరదాగా హెచ్చరించడం.. ‘అమ్మో..’ అంటూ వరుణ్ భయపడినట్లు నటించడం.. ఇదంతా చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌ని జనరేట్ చేసింది.
మరోపక్క, మూడో రోజు హౌస్‌లో (Bigg Boss 3 Telugu) ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. క్రమక్రమంగా వివాదాలు రాజుకుంటున్నాయి. దానికి ఫుల్‌స్టాప్ పెట్టడం కోసమేనా? అన్నట్లు చిన్న పిల్లల టాస్క్ ఒకటి షురూ చేశాడు బిగ్ బాస్. అంతే హౌస్‌లో వరుణ్, పునర్నవి (Punarnavi Bhupalam) తప్ప అందరూ చిన్న పిలల్లా బిహేవ్ చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో చాలా అల్లరి జరిగింది.
కానీ, మహేష్ విట్టా (Mahesh Vitta) ఈ అల్లరిని తట్టుకోలేకపోయాడు. ‘పిచ్చితనం..’ అంటూ మండిపడ్డాడు. దానికి కారణం కూడా లేకపోలేదు.. ‘కర్రోడు’ అంటూ తన కలర్ గురించి హౌస్‌మేట్స్‌లో ఒకరిద్దరు కామెంట్ చేయడం పట్ల హర్ట్ అయ్యాడు మహేష్. ఇదిలా వుంటే బాబా భాస్కర్ ఫుల్ ఫన్ జనరేట్ చేస్తున్నాడు హౌస్‌లో.
సీనియర్ నటి హేమ మాత్రం, వివాదాలకు ఆజ్యం పోస్తోంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కీ హేమకీ మధ్య మాటల యుద్ధం జరిగింది. నిన్నటి ఎపిసోడ్‌లో లౌడ్ సీన్ ఇదేనని నిస్సందేహంగా చెప్పొచ్చు. కాగా, పునర్నవి కేర్ టేకర్ పాత్రలో ఒదిగిపోయింది. ఓవరాల్‌గా, హౌస్‌లో అందరూ పెర్‌ఫెక్ట్ గేమ్ ప్లాన్‌తోనే వ్యవహరిస్తున్నారు. దాదాపుగా అందరికీ స్క్రీన్ ప్లేస్ సమానంగానే దక్కుతోంది. ఎవరికి వారు హైలైట్ అయ్యేందుకు తమవంతు కృషి చేస్తున్నారు.
చిన్న పిల్లల టాస్క్ సందర్భంగా రోహిణి (Rohini), శ్రీముఖి (Sree Mukhi) రచ్చ రచ్చ చేసేశారు. శ్రీముఖి అయితే, కేర్ టేకర్ అయిన పునర్నవి మైక్ దాచేసింది. ఆ తర్వాత శ్రీముఖిని (Sree Mukhi Army) కేర్ టేకర్ పునర్నవి హెచ్చరించడం, భయపడినట్లు శ్రీముఖి నటించడం.. ఫన్ జనరేట్ చేశాయి. సావిత్రి డల్ అయిపోయింది. కుట్రలు కుతంత్రాలు.. గ్రూపు రాజకీయాలు కొంచెం కొంచెంగా ముదిరిపోతున్నాయి.