Varuntej In Ramcharan Foot Steps.. ‘వినయ విధేయ రామ’ సినిమా గుర్తుందా.? ఆ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది కానీ, అంచనాల్ని అందుకోలేకపోయింది. సినిమా ఫ్లాప్ అవ్వడం ఓ ఎత్తు. ఆ సినిమాలో అర్ధం పర్ధం లేని సన్నివేశాలు ఇంకో ఎత్తు.
హీరో రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) చాలా కష్టపడ్డాడు. కానీ, దర్శకుడే ‘వినయ విధేయ రామ’ (Vinaya Vidheya Rama) సినిమాని నాశనం చేశాడు.
అయినా కానీ, సినిమా అలా నాశనమైపోతుంటే, హీరో ఎలా ఒప్పుకుని పూర్తి చేశాడన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
అందుకేనేమో, సినిమా పరాజయం పట్ల చింతిస్తూ చరణ్ అప్పట్లో ఓ క్షమాపణ నోట్ విడుదల చేశాడు అభిమానుల కోసం.
వాస్తవానికి సినిమా ఎలా వున్నా కానీ, ‘వినయ విధేయ రామ’ చెప్పుకోదగ్గ స్థాయిలోనే వసూళ్లను రాబట్టింది.
Varuntej In Ramcharan Foot Steps.. తప్పు ఎక్కడ జరిగింది చెప్మా.?
తాజాగా అన్న బాటలోనూ తమ్ముడు వరుణ్ తేజ్ కూడా అభిమానులకి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. దానికి కారణం ‘గని’ (Ghani Movie Varun Tej) సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై, డిజాస్టర్‌గా తేలడమే.
సినిమా విడుదలకు ముందు తమ సినిమా చాలా గొప్పగా వుంటుందని, సినిమా టీమ్ ప్రచారం చేసుకోవడం మామూలే.
అన్ని సినిమాల విషయంలోనూ ఈ పబ్లిసిటీ తప్పదు. అయితే, అన్ని సినిమాలూ విజయం సాధించవ్ కదా.
సక్సెస్ సీక్రెట్ తెలిసిపోతే, అసలంటూ ఫ్లాప్ సినిమాలే రావు. చాలా నాసిరకం సినిమాలు సూపర్ హిట్లు అయిపోతుంటాయ్. అదే సినిమా మ్యాజిక్.
ఆ మ్యాజిక్ తెలిస్తే, ఎవరైనా ఎందుకు ఫ్లాపులు తీస్తారు. ఒక్కోసారి దర్శకుడు మంచి కథ చెప్పాలనుకున్నా, అది ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. ఒక్కోసారి చెత్త కథ కూడా ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయొచ్చు.
Also Read: Disha Patani.. అందాల రాక్షసివే.. గుండెల్లో గుచ్చేశావే.!
గతంలో చరణ్ క్షమాపణలు చెప్పినా, ఇప్పుడు వరుణ్ (Mega Prince Varun Tej) క్షమాపణలు చెప్పినా అది వారి హుందాతనం.
చాలా మంది హీరోలు తమ చెత్త సినిమాల్ని సూపర్ హిట్లుగా చెప్పేసుకునే సినీ పరిశ్రమలో చరణ్ కావచ్చు, వరుణ్ కావచ్చు వెరీ వెరీ స్పెషల్ అంతే.!