Table of Contents
Vasuki Indicus.. వాసుకి.. అంటే, అదొక పాము పేరు.! హిందూ పురాణేతిహాసాల్లో ‘వాసుకి’కి వున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.!
దైవత్వం కలిగిన సర్పరాజం వాసుకి.! ఆ పేరుని, ఓ పెద్ద పాముకి పెట్టారిప్పుడు పరిశోధకులు. దాంతో, ‘వాసుకి’ అనేది కల్పితం కాదు, నిజం.. అన్న చర్చ అంతటా జరుగుతోంది.
ఇంతకీ, ‘వాసుకి’ కథా కమామిషు ఏంటి.? పురాణేతిహాసాల్లో చెప్పబడిన వాసుకి అనే సర్పరాజానికీ, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న ‘వాసుకి’కి ఏమైనా సంబంధం వుందా.?
Vasuki Indicus.. వాసుకి ఇండికస్..
మన దేశంలోనే, ‘వాసుకి ఇండికస్’ అనే సర్పానికి సంబంధించిన ఉనికిని కనుగొన్నారు. అయితే, లక్షల ఏళ్ళ క్రితం సంచరించిన పాము ఇది.
ఓ పెద్ద పాముకి సంబంధించిన శిలాజం లభ్యమైంది. ఈ శిలాజంపై, ఐఐటీ ప్రొఫెసర్స్ అధ్యయనాలు ప్రారంభించారు. ఈ అధ్యయనాల నేపథ్యంలోనే, ‘వాసుకి ఇండికస్’ అనే పేరుని పెట్టారు.

‘వాసుకి ఇండికస్’ పొడవు 15 మీటర్లుగా అంచనా వేశారు. అంటే, సుమారు 49 అడుగులు అన్నమాట. ఇప్పటిదాకా ప్రపంచంలోనే అతి పెద్ద పాము అంటే, ‘టైటనా బోవా’.
విష సర్పం కాదు కదా.?
పురాణేతిహాసాల్లో చెప్పబడిన వాసుకి ‘నాగ’ జాతికి చెందినది. కానీ, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న వాసుకి ఇండికస్ మాత్రం, విష సర్పం కాదు.
పైథాన్.. అంటే, మనం కొండ చిలువగా పిలబడే పాముల జాతికి చెందినది వాసుకి ఇండికస్ అని పరిశోధకులు చెబుతున్నారు.
వేరే ప్రాంతం నుంచి, ఇక్కడికి వాసుకి ఇండికస్ వలస వచ్చినట్లు అనుమానిస్తున్నారు పరిశోధకులు. గుజరాత్ ప్రాంతంలో ఈ శిలాజాన్ని కనుగొన్నారు.
పురాణేతిహాసాల్లో వాసుకి..
నాగలోకానికి రాజు ‘వాసుకి’.! క్షీర సాగర మదనంలో వాసుకిని ‘తాడు’లా వినియోగించారు.
Also Read: టూరిస్ట్ ఫ్యామిలీ రివ్యూ: ‘అక్రమ వలస’ని ఎలా ఒప్పుకుంటాం.?
ప్రతి రుతువులో సూర్య దేవునికి తోడుగా, రథములో ప్రయాణించే ఇద్దరు నాగుల్లో ఒకరు వాసుకి అని పురాణేతిహాసాలు చెబుతున్నాయి.
మరోపక్క, కృష్ణుడే వాసుకి అని కూడా చెబుతుంటారు పండితులు. నాగరాజు గనుక, వాసుకి ‘మణి’ కలిగి వుంటాడు.