Venu Swamy Blackmailing.. వేణు స్వామి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు కదా.!? ఇప్పుడతను ‘ఆత్మహత్య తప్ప తనకు వేరే మార్గం లేదు’ అని అంటున్నాడు.
కేవలం వేణు స్వామి మాత్రమే కాదు, ఆయన సతీమణి వీణా శ్రీవాణి కూడా ఇదే విషయమై కన్నీరు మున్నీరవుతోంది.
ఎందుకిలా.? అందరి జాతకాలూ చెప్పే వేణు స్వామి, తన జీవితంలో ఇలాంటి ఓ దుస్థితి వస్తుందని ఎందుకు ఊహించలేకపోయాడు.?
Venu Swamy Blackmailing.. అసలేం జరిగింది.?
సినీ నటుడు అక్కినేని నాగచైతన్య, సినీ నటి శోభిత ధూళిపాల త్వరలో వైవాహిక బంధంతో ఒక్కటి కానున్నారు. కానీ, వీరి వైవాహిక జీవితం సజావుగా సాగదని బాంబు పేల్చాడు వేణు స్వామి.
గతంలో నాగచైతన్య – సమంత వైవాహిక జీవితం గురించీ ఇలాగే చెప్పాడు, వాళ్ళిద్దరూ తమ వైవాహిక బంధాన్ని ‘విడాకులతో’ తెగ్గొట్టుకున్నారు.
సరే, ఈ రోజుల్లో వైవాహిక బంధాలు ఎంత బలంగా వున్నాయి.? అన్నది అందరికీ తెలిసిన విషయమే.
నాగ చైతన్య – శోభిత గురించి వేణు స్వామి చెప్పిన జోస్యం చాలామందికి నచ్చలేదు. ఆయన్ని తిట్టి పోశారు. ఓ న్యూస్ ఛానల్ ఈ విషయమై ఓ చర్చా కార్యక్రమాన్నీ నిర్వహించింది.
అక్కడే తేడా కొట్టింది వ్యవహారం. సీనియర్ జర్నలిస్టు మూర్తి, వేణు స్వామిని నానా తిట్లూ తిటారు. అద్గదీ అసలు సంగతి.
బ్లాక్‌మెయిలింగ్ ఎవరిది.?
జోతిషం అంటేనే బ్లాక్‌మెయిలింగ్.. అనే స్థాయికి జోతిష శాస్త్రాన్ని దిగజార్చేశాడు వేణు స్వామి. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలపై వేణు స్వామి చెప్పిన జాతకాలు, ఎంతోమంది బెట్టింగుల్లో కోట్లు పోగొట్టుకోవడానికి కారణమైంది.
ఆయా రాజకీయ పార్టీల నుంచి డబ్బులు తీసుకుని, ఆ పార్టీలకు అనుకూలంగా జోతిషం చెప్పిన ఘనుడు వేణు స్వామి.
ఇంతటి ఘన చరిత్ర వున్న వేణు స్వామి, తనను సీనియర్ జర్నలిస్ట్ మూర్తి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపించడం గమనార్హం.
Also Read: టాలీవుడ్ ‘పల్స్’ పట్టేసిన భాగ్యశ్రీ.!
సీనియర్ జర్నలిస్ట్ మూర్తి అడిగినట్లుగా ఐదు కోట్లు ఇచ్చే పరిస్థితుల్లో తాము లేమనీ, తమకు ఆత్మహత్య ఒక్కటే శరణ్యమనీ ఏడుస్తూ వేణు స్వామి, అతని భార్య ఓ వీడియో విడుదల చేశారు.
కామెడీ ఏంటంటే, మద్యం – మాంసం సేవిస్తూ బ్రాహ్మణత్వానికి మకిలి పట్టించిన వేణు స్వామి, ఇప్పుడు బ్రాహ్మణ సమాజం తనను ఆదుకోవాలని కోరుతుండడం.
నిజానికి, వేణు స్వామికి ఇలాంటి నాటకాలు కొత్త కావు. కాకపోతే, ఈ ఎపిసోడ్‌లో వేణు స్వామి, తన భార్యని కూడా రోడ్డున (వివాదాల్లోకి లాగాడు) పడేశాడు.