బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ (Vidya Balan Fashion Mantra Bold And Beautiful) అనగానే ఆమె నటించిన ‘డర్టీ పిక్చర్’ సినిమానే గుర్తుకొస్తుంది చాలామందికి. అంతకు ముందు ఆమె ఎన్ని సినిమాలు చేసినా, ఆ తర్వాత ఎన్ని హిట్ సినిమాలు చేసినా, ‘డర్టీ పిక్చర్’తో ఆమెకు లభించిన గుర్తింపు, మరే సినిమా కూడా ఆమెకు ఇవ్వలేదని నిస్సందేహంగా చెప్పొచ్చు.
హీరోయిన్లు అందంగా కన్పించడానికి, రకరకాల ఫ్యాషన్ మంత్రాలు జపిస్తుంటారు. బికినీల్లో మెరిసిపోతుంటారు.. షార్ట్ డ్రస్సుల్లో కవ్విస్తుంటారు. విద్యాబాలన్ (Vidya Balan) కూడా ఒకప్పుడు ఫ్యాషన్ ఐకాన్ అనిపించుకోవడానికి చాలా కష్టపడింది. అయితే, హార్మోన్ల సమస్యలతో తన శరీరం జీరో సైజ్ ఫిజిక్‌కి సరిపోదని గుర్తించింది విద్యబాలన్.
చీర కట్టుకి అసలు సిసలు బ్రాండ్ అంబాసిడర్..
అంతే, అక్కడినుంచి సన్నబడాలనే ఆలోచన పక్కన పడేసింది. తన శరీరానికి తగ్గట్టుగా తన ఆలోచనల్ని మార్చేసుకుంది ఈ బొద్దుగుమ్మ (Vidya Balan Fashion Mantra Bold And Beautiful). సాధారణ చీరకట్టులో ఫ్యాషన్ హొయలొలికించేయడమెలాగో ప్రయత్నించి చూసింది, సక్సెస్ అయ్యింది. మామూలు చీరల్లోనూ మెరిసిపోయేలా అందమైన ‘కట్టు’ ఆమె తన సొంతం చేసుకుంది.
ఇక, ఆ తర్వాత విద్యబాలన్ శారీస్, విద్యబాలన్ ‘చీరకట్టు’ అంటూ మహిళా లోకం ఆమెను ఫాలో అవడం ప్రారంభించింది. ‘మన శరీరానికి సరిపోయే ఏ కాస్ట్యూమ్ అయినా అది మనకి అందంగా వుంటుంది. దానికోసం అనవసరమైన కష్టాలు పడినా నష్టమే తప్ప లాభం వుండదు’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది విద్యాబాలన్.
వల్గారిటీ.. చూసే కళ్ళలోనే..
‘వల్గారిటీ’ అన్న మాటకు అర్థమే లేదని చెప్పే విద్యాబాలన్, చూసేవాళ్ళ కళ్ళని బట్టి ‘జుగుప్స’ అనేది ఆధారపడి వుంటుందని అభిప్రాయపడింది. ‘డర్టీ పిక్చర్’ సినిమా సమయంలో నా ఫొటోలు చూసి, తనను చాలామంది చాలా రకాలుగా వేధించేందుకు ప్రయత్నించారనీ, ఆ సినిమా వచ్చాక వాళ్ళే తనను ప్రశంసల్లో ముంచెత్తారనీ ఓ ప్రశ్నకు బదులిచ్చింది విద్యాబాలన్.
‘ఈ తరం అమ్మాయిలకు కొత్తగా ఫ్యాషన్ పాఠాలు చెప్పాల్సిన పనిలేదు’ అంటూనే, ఫ్యాషన్ పేరుతో శరీరాన్ని ఎక్కువగా కష్టపెట్టెయ్యొద్దని మాత్రం సలహా ఇచ్చింది ఈ బాలీవుడ్ బ్యూటీ (Vidya Balan Fashion Mantra Bold And Beautiful).