Vijay Deverakonda About Chiranjeevi.. మెగాస్టార్ చిరంజీవి, తెలుగు సినిమాకి సంబంధించి.. అప్పటిదాకా వున్న నటన, డాన్సులు, ఫైట్స్.. వీటన్నిటినీ మార్చిన వ్యక్తి.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు విజయ్ దేవరకొండ.
తన తాజా చిత్రం ‘ఖుషీ’ ప్రమోషన్ల సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన విజయ్ దేవరకొండ, ‘ఆరు ఫ్లాపుల తర్వాత రజనీకాంత్ చేసిన సినిమా 500 కోట్లు వసూలు చేసింది..’ అని పేర్కొన్నాడు.
రజనీకాంత్, చిరంజీవి.. వీళ్ళని సక్సెస్, ఫెయిల్యూర్స్‌కి అతీతంగా చూడాలంటున్నాడున్నాడు విజయ్ దేవరకొండ.
‘వాళ్ళని జడ్జ్ చేయడం మానేయాలి. ఎప్పుడైనా బౌన్స్ బ్యాక్ అవగల సత్తా వారికి వుంటుంది. మనం మూసుకుని చూడాల్సిందే..’ అంటూ, మీడియాకి చురకలంటించాడు రౌడీ హీరో.!
Vijay Deverakonda About Chiranjeevi.. ఎందరికో మెగా స్ఫూర్తి..
‘వేలాది మందికి చిరంజీవి సినీ రంగంలో స్ఫూర్తిగా నిలిచారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన స్ఫూర్తితోనే మేమంతా రాణిస్తున్నాం..’ అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.
‘ఓ మంచి వాతావరణాన్ని చిరంజీవి లాంటి స్టార్స్ క్రియేట్ చేశారు. అందులో మేమున్నాం..’ అని చెప్పిన విజయ్ దేవరకొండ, ‘వాల్తేరు వీరయ్య’తో చిరంజీవి కొట్టిన సూపర్ హిట్ గురించి ప్రస్తావించాడు.

‘భోళా శంకర్’ ఫ్లాప్ కావడంతో, చిరంజీవిపై నానా రకాల విమర్శలూ కొందరు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ, తనదైన స్టయిల్లో స్పందించాడన్నమాట.
విజయ్ దేవరకొండ చెప్పాడని మాత్రమే కాదుగానీ.. మెగాస్టార్ చిరంజీవి అంటే ఓ లివింగ్ లెజెండ్.!
Also Read: కర్ర పెత్తనం.! ‘పులి’ రాజా.. పారిపో.!
చిరంజీవి చూడని సక్సెస్సులేమున్నాయ్.! తెలుగు సినిమా బాక్సాఫీస్‌కి తనదైన కమర్షియల్ స్టార్‌డమ్ అద్దిన స్టార్ హీరో ఆయన.
అభిమానం.. భక్తిభావం.!
అలాంటి చిరంజీవిని ఆరాధించడమంటే, తమ గౌరవాన్ని మరింత పెంచుకోవడమే.. అని విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరోలు భావించడంలో వింతేముంది.?
అయినా, చిరంజీవిపై తన అభిమానాన్ని చాటుకోవడం విజయ్ దేవరకొండకి ఇదే తొలిసారి కాదు. పలు సందర్భాల్లో ఆయన చిరంజీవి గొప్పతనాన్ని చెబుతూ వచ్చారు.
‘మా చిరంజీవిగారు’ అంటూ పలు సందర్భాల్లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మెగాస్టార్ చిరంజీవిని ఓన్ చేసుకుని చెప్పడం విన్నాం.!