Vijay Deverakonda Family Star.. ‘ఖుషి’ సినిమా కోసం విజయ్ దేవరకొండ చెయ్యాల్సిందంతా చేశాడు.! అవసరమైనదానికంటే కూడా ఇంకాస్త ఎక్కువే కష్టపడ్డాడు.!
కానీ, ‘ఖుషి’ ఫలితం విజయ్ దేవరకొండకి ఇవ్వాల్సిన స్థాయిలో ‘కిక్కు’ ఇవ్వలేకపోయింది. ‘సినిమా హిట్టే’.. అంటూ, కోటి రూపాయల మొత్తాన్ని లక్ష రూపాయల చొప్పున.. వంద కుటుంబాలకు సాయంగా అందించాడు విజయ్.
ఇక, ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’ అంటున్నాడు విజయ్ దేవరకొండ. మృనాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్. పరశురామ్ దర్శకుడు.
Vijay Deverakonda Family Star.. బుద్ధిమంతుడేగానీ..
తాజాగా, ‘ఫ్యామిలీ స్టార్’ టీమ్ ఓ గ్లింప్స్‌ని విడుదల చేసింది. చాలా బుద్ధిమంతుడి గెటప్గానీ, చాలా పవర్ ఫుల్ రోల్.. అన్నట్లు ఎలివేషన్స్ ఇచ్చారు విజయ్ దేవరకొండ పాత్రకి.
విజయ్ దేవరకొండ అభిమానులు ఖుషీ అయ్యేలానే ‘గ్లింప్స్’ రూపొందింది. మహేష్‌బాబుతో ‘సర్కారు వారి పాట’ చేసిన తర్వాత, పరశురామ్ నుంచి వస్తోన్న సినిమా ఇదే.
గ్లింప్స్ చివర్లో మృనాల్ ఠాకూర్ (Mrunal Thakur) ‘ఏవండీ..’ అంటూ విజయ్ దేవరకొండని పిలవడం.. ఓ క్లాస్ టచ్ ఇచ్చింది.
మాస్ మెచ్చే అన్ని అంశాలతోపాటు, క్లాస్‌ని కూడా మెప్పించే అంశాల్ని దర్శకుడు పొందుపర్చినట్లే వుంది ‘ఫ్యామిలీ స్టార్’లో.!
నిజానికి, ‘ఖుషి’ ప్రోమోస్ అన్నీ చాలా బాగా డిజైన్ చేశారు. కానీ, ఫలితమే బొక్క బోర్లా పడింది. అలాగని, ‘ఖుషి’ సినిమాని పూర్తిగా తీసి పారెయ్యడానికి వీల్లేదు.
Also Read: The Eye.. శృతి హాసన్ ‘గ్లోబల్’ రేంజ్ గ్లామర్.!
ఓవర్సీస్లో ‘ఖుషి’ బాగానే ఆడింది. కాకపోతే, ఇక్కడే.. దెబ్బ పడింది. సమంత ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.
ఇంతకీ, ‘ఫ్యామిలీ స్టార్’తో విజయ్ దేవరకొండ బౌన్స్ బ్యాక్ అవుతాడా.? అయి తీరాల్సిందే.! ఫ్లాపులొస్తున్నా, విజయ్ దేవరకొండ మార్కెట్ స్టడీగానే వుందిగానీ.. ఫ్లాపులు పెరిగితే, ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది మరి.!
ప్రోమోతో హిట్టు కళ అయితే షురూ అయ్యింది.! సినిమాలో కంటెంట్ కూడా బావుంటే.. సంక్రాంతికి వసూళ్ళ పండగే.!