Vijay Deverakonda Hit.. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది.
ఇటు విజయ్ దేవరకొండ కెరీర్‌లోనూ అటు పూరి జగన్నాథ్ కెరీర్‌లోనూ మెమరబుల్ ఫిలిం అవుతుందనుకుంటే.. ‘లైగర్’ కాస్తా డిజాస్టర్ అయికూర్చుంది.
దర్శకుడు పూరి జగన్నాథ్ కంటే కూడా ఈ సినిమా ఎఫెక్ట్ విజయ్ దేవరకొండ మీద గట్టిగా పడింది. అభిమానులకు ‘హిట్టు’ బాకీ పడిపోయాడు విజయ్ దేవరకొండ.
Vijay Deverakonda Hit పెండింగ్.. వెయిటింగ్..
‘అదొక్కటే పెండింగ్.. హిట్టు కొట్టేద్దాం..’ విజయ్ దేవరకొండ తాజాగా అభిమానులతో ముచ్చటిస్తూ వ్యాఖ్యానించాడు.
‘ఖుషీ’ సినిమాతో హిట్టు కొట్టబోతున్నామంటూ అభిమానులు చెబుతోంటే, నేనూ దానికోసమే వెయిటింగ్.. అని చెప్పాడు విజయ్ దేవరకొండ.

సమంత – విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ‘ఖుషీ’ స్టార్ట్ అయ్యింది. అనివార్య కారణాల వల్ల సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.
Also Read: ‘భీమ్లానాయక్’ మొదటిది కాదు, మూడోది: సంయుక్త.!
అనారోగ్య సమస్యలు, ఇతరత్రా కారణాల వల్ల సమంత, ‘ఖుషీ’ సినిమా షూటింగ్‌కి తిరిగి హాజరవడంలో ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా వుంటే, విజయ్ దేవరకొండ – పరశురామ్ కాంబినేషన్‌లో ‘గీత గోవిందం -2’ తెరకెక్కాల్సి వుంది.