Vijay Deverakonda Kingdom Controversy.. తెలుగు సినీ పరిశ్రమలో నోటి దురదకు కేరాఫ్ అడ్రస్.. అంటే, ముందుగా అందరికీ గుర్తుకొచ్చే పేరు విజయ్ దేవరకొండ.!
హిట్లు కొట్టినప్పుడు లెక్క వేరు, ఫ్లాపుల్లో వున్నప్పుడు పరిస్థితి వేరు. విజయ్ దేవరకొండ స్టార్‌డమ్ పాతాళానికి పడిపోయిందిప్పుడు.!
ఈ పరిస్థితుల్లో నోరు ఒకింత అదుపులో పెట్టుకోవాలి కదా.? అబ్బే, అలా చేస్తే అతను విజయ్ దేవరకొండ ఎందుకు అవుతాడు.?
తాజాగా, ‘రెట్రో’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ తన నోటి దురదను చాటుకున్నాడు. నిజానికి, అనాలని అన్న మాట కాదది.! ఏదో అనుకోకుండా జరిగిపోయింది.
Vijay Deverakonda Kingdom Controversy.. తీవ్రవాదానికీ.. ట్రైబల్స్‌కీ లింకేంటి.?
ఇండియా – పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం గురించి మాట్లాడుతూ, ‘ఐదొందల ఏళ్ళ క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు.. ఈ తీవ్రవాదం ఏంటి.?’ అనేశాడు విజయ్ దేవరకొండ.

ట్రైబల్స్ అంటే ఎవరు.? టెర్రరిస్టులు అంటే ఎవరు.? అన్న తేడా తెలియనంత అమాయకుడైతే కాదు విజయ్ దేవరకొండ. సరిగ్గా పోలిక చేయలేక తడబడ్డాడంతే.
ఇంకేముంది.? విషయం వివాదాస్పదమయ్యింది. గిరిజన నేతలుగా చెప్పుకుంటున్న కొందరు, విజయ్ దేవరకొండపై మండిపడ్డారు. విజయ్ దేవరకొండ సినిమాల్ని బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు చేసేశారు.
వివరణ ఇచ్చాడుగానీ..
చేసేది లేక, విజయ్ దేవరకొండ వివరణ ఇచ్చాడు. తన ఉద్దేశ్యం ‘అది’ కాదంటూ, వివరించుకునే ప్రయత్నం చేశాడు. అక్కడితో, వివాదం కాస్త చల్లబడింది.
ఒకప్పుడు పరిస్థితి వేరు.. వివాదాలు, సినిమాలకు ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెట్టేవి. అందుకే, విజయ్ దేవరకొండ కూడా చెలరేగిపోయేవాడు వివాదాస్పద వ్యాఖ్యలతో.
Also Read: ‘మంచు’ కురిసిపోవడం ఏంటి శ్రీవిష్ణూ! తప్పు కదా ‘శివయ్యా’.!
విజయ్ దేవరకొండ నోటివెంట బూతులు కూడా అలవోకగా వచ్చేసేవి. అప్పటి పరిస్థితులు వేరనుకోండి.. అది మల్ళీ వేరే చర్చ.
అలాంటి ఓ బూతు వ్యాఖ్య నేపథ్యంలో యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇప్పటికీ విజయ్ దేవరకొండ సినిమాలు ఫ్లాపయితే పండగ చేసుకుంటుంటుంది.
తెలుసు కదా, విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘కింగ్‌డమ్’ విడుదలకు సిద్ధమవుతోందని. ‘మిస్టర్ బచ్చన్’ ఫేం భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో హీరోయిన్.