Vijay Deverakonda Samantha Kushi.. విజయ్ దేవరకొండ, సమంత ప్రధాన పాత్రల్లో ‘ఖుషీ’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సమంతకి ‘మయోసైటిస్’ సమస్య కారణంగా సినిమా షూటింగ్‌కి పెద్ద ‘బ్రేక్’ వచ్చింది.
మళ్ళీ ‘ఖుషీ’ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందనే విషయమై దర్శక నిర్మాతలు కూడా స్పష్టత ఇవ్వలేని పరిస్థితి.
అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఖుషీ’ సినిమాని అనౌన్స్ చేశారు అప్పట్లో. విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమా చేస్తున్న టైమ్ అది. పాన్ ఇండియా హీరో.. అనే ట్యాగ్ వచ్చేసింది అప్పటికే విజయ్‌కి.!
Vijay Deverakonda Samantha Kushi.. సమంత పరిస్థితేంటి.?
సమంత ప్రస్తుతం ముంబైలో వుంది. ఓ వెబ్ సిరీస్ కోసం ఆమె పనిచేస్తోందిట. అది పూర్తయ్యాక, ‘శాకుంతలం’ సినిమా ప్రమోషన్ల కోసం వస్తుందట.
మరి, ‘ఖుషీ’ పరిస్థితేంటి.? ప్రస్తుతానికైతే ఈ సినిమాని చిత్ర దర్శక నిర్మాతలు వదిలేసినట్లేనన్న ప్రచారం జరుగుతోంది.
‘తూచ్.. అదంతా ఉత్త ప్రచారం.. త్వరలో సినిమా మళ్ళీ సెట్స్ మీదకు వెళుతుందని దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు.
లాక్ అయిపోయిన విజయ్..
సమంత (Samantha Ruth Prabhu) నుంచి ‘శాకుంతలం’ సినిమా రాబోతోంది. మరి, విజయ్ దేవరకొండ పరిస్థితేంటి.? ప్చ్.. అగమ్య గోచరమే.!
‘లైగర్’ దెబ్బ నుంచి విజయ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆ సినిమా ఎఫెక్ట్ కారణంగానే ‘జనగనమన’ సినిమా కూడా క్యాన్సిల్ అయ్యింది.
Also Read: టీజర్ రివ్యూ: ఊర మాస్ జాతర! నాని ‘దసరా’.!
ఇప్పుడేమో ‘ఖుషీ’పైనా అనుమానాలు. మొత్తంగా చూస్తే విజయ్ దేవరకొండ బ్యాడ్ టైమ్ నడుస్తోందన్నమాట. ఆ బ్యాడ్ టైమ్ కంటే, సమంత మయోసైటిస్.. విజయ్ దేవరకొండని గట్టిగా కొట్టింది.