Jana Nayagan Vijay.. సమాచార దారిద్ర్యం అనగానేమి.? భావదారిద్ర్యం అనగానేమి.? ఇప్పుడు, ఈ మాటల చుట్టూ ఎందుకింత రచ్చ జరుగుతోంది.?
దిగజారుడుతనాన్ని ఇంకో రూపంలో భావదారిద్ర్యం.. అంటుంటాం. ఈ సమాచార దారిద్ర్యం.. అంటే ఏంటో మరి.! కొత్త పదమే ఇది.! దీన్ని కనిపెట్టాడో మహానుభావుడు.!
సరే, అసలు విషయంలోకి వస్తే, ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ డేట్ గురించి ముందే కూసింది ఓ ట్విట్టర్ పిట్ట.! సరే, ఇప్పుడు ట్విట్టరుని ‘ఎక్స్’ అంటున్నాం కదా.!
సో, ‘ఎక్స్’ర్నలిస్ట్ అన్నమాట.! గాలి పోగేసి వార్తలు రాయడం, ఈ ‘ఎక్స్’ర్నలిస్ట్ పని.! సమాచారాన్ని తస్కరించి మరీ, పోస్టులు పెట్టేస్తుంటాడు. అదో పైత్యం.
Jana Nayagan Vijay.. ఎవడు ముందు బ్రేక్ చేస్తే ఏంటి బ్రో.!
‘నేనే ముందు బ్రేక్ చేశా..’ అని పైత్యం ప్రదర్శించడం ఈ ‘ఎక్స్’ర్నలిస్ట్ ఘనత. సదరు స్టార్ హీరో సినిమా రిలీజ్ డేట్ గురించి ఇతనేదో ముందే కూస్తే, దాన్ని ఇంకొంతమంది ‘ఎక్స్’ర్నలిస్టులు ఫాలో అయ్యారు.
దాంతో, మన ‘ఎక్స్’ర్నలిస్టుకి కోపమొచ్చి, ఇదిగో ‘సమాచార దారిద్ర్యం.. భావ దారిద్ర్యం..’ అంటూ ‘ఎక్స్’ వేదికగా కూశాడు.
ఒక విషయం బయటకు పొక్కాక, అది ఎక్స్‌క్లూజివ్ ఎలా అవుతుంది.? అన్నది ఈ ‘ఎక్స్’ర్నలిస్టు ప్రశ్న. దీన్నే పిచ్చి.. అంటారు. లేకపోతే ఏంటి.? ఇది సోషల్ మీడియా యుగం. ‘నాది ముందు’ అంటే కుదరదిక్కడ.!
సంక్రాంతి రిలీజ్..
ఇంతకీ, ఆ సినిమా ‘జన నాయగన్’. హీరో విజయ్.! తమిళ హీరో విజయ్‌కి తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ పెద్దగా వుండదని అందరికీ తెలుసు కదా.!
Also Read: జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్.! తెలియక హత్య చేశానని బుకాయిస్తే.?
తమిళనాట ఇప్పటికే విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసేశాడు. ఇంకోపక్క, ‘జననాయగన్’ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. అద్గదీ అసలు సంగతి.
ఇప్పుడర్థమయ్యింది కదా.. ఊళ్ళో పెళ్ళికి గ్రామ సింహాల హడావిడి.. అని ఎందుకు అనాల్సి వస్తోందో.! ఊళ్ళో పెళ్ళికి తెలుగు ‘ఎక్స్’ర్నలిస్టుల హడావిడి.. అని కూడా ఇకపై అనుకోవాలన్నమాట.!