Viral Video Mother Kids..‘అమ్మా నేను నీకు ఎలా పుట్టానమ్మా.?’ అని పిల్లలు తల్లిని అడుగుతుంటారు. చిన్నతనంలో అందరికీ సహజంగా కలిగే అనుమానమే ఈ ప్రశ్న.
అయితే, ఆ ప్రశ్నకు ఆ తల్లి సమాధానం ఎలా చెప్పాలో తెలియక తెగ సతమతమైపోతుంటుంది. ఎలా చెప్పినా సరే, అప్పటి పిల్లలు ఓహో.! అని పరిపెట్టేసుకుంటారు.
పొట్ట కోసి పిల్లల్ని బయటకి తీస్తారు. మళ్లీ కుట్లు వేసి పొట్టని కుట్టేస్తారమ్మా.! అని చాలా మంది తల్లులు చెప్పే మాట. దాన్నే సిజేరియన్ అంటారు.
కానీ, ఈ తల్లి మాత్రం తన బిడ్డ అడిగిన ప్రశ్నకు ఎంత వివరంగా సమాధానం చెప్పిందో చూస్తే షాకవ్వాల్సిందే.
ఓ నారింజ పండును గర్భిణిగా చూపించి సిజేరియన్ ఇదిగో ఇలా జరుగుతుంది.. అని ఆ తల్లి వివరించింది.
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అయిపోతోంది. స్వయంగా ఓ ప్రముఖ డాక్టర్ ఈ వీడియోని తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేయడం విశేషం.
Viral Video Mother Kids.. నారింజ పండుకు సిజేరియన్ చేసి..
నారింజ పండును కోసి, అందులోని తొనలను పిల్లల మాదిరిగా బయటికి తీసి, మళ్లీ కుట్లు వేయడం ఎంత చక్కగా కనిపిస్తుందో ఈ వీడియోలో.
లక్షల్లో వ్యూస్ వస్తున్నాయ్ ఈ వీడియోకి. సిజేరియన్ ద్వారా పిల్లలు పుట్టడాన్ని ఈ తల్లి ఎంత చక్కగా వివరించిందో కదా.. అని ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ మెచ్చుకోకుండా వుండలేకపోతున్నారు.
Also Read: Swetha Naagu.. అత్యంత విషపూరితమా.! అసలుందా.?
అఫ్‌కోర్స్.! వీడియో వైరల్ అయ్యింది సరే.! మీరు ఏ కాలంలో వున్నారండీ. ఇది గూగుల్ కాలం. ఇప్పుడు పిల్లలకు ఏ విషయం తెలుసుకోవాలన్నా తల్లిని ఎందుకు అడుగుతున్నారు చెప్పండి.
డైరెక్ట్‌గా గూగుల్ తల్లినే కదా అడుగుతున్నారు. ఆ గూగుల్ తల్లి చెప్పే నిజాలనే పిల్లలు నమ్ముతున్నారు.
నో సీక్రెట్స్.. నో డౌట్స్.. ఎనీ థింగ్ ఆస్కింగ్ విత్ ఇన్ సెకన్స్.. రియల్ విజువల్‌తో గూగుల్ తల్లి కళ్లముందుంచేయట్లా ప్రతీ నిజాన్నీ.!