Virat Gambhir Fight.. గౌతమ్ గంభీర్.. విరాట్ కోహ్లీ.! ఈ ఇద్దరిలో ఎవరు పెద్ద తోపు.! ఈ విషయమై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది.
విరాట్ కోహ్లీ ఇంకా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతూనే వున్నాడు. గౌతమ్ గంభీర్ కొన్నాళ్ళ క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పాడు.!
టీమిండియాకి సంబంధించి గౌతమ్ గంభీర్ (Gautam Gambhir).. ఓ విలువైన ఆటగాడు.! విరాట్ కోహ్లీ గురించి కొత్తగా చెప్పేదేముంది.? కింగ్ కోహ్లీ అంటుంటాం.
Virat Gambhir Fight.. ఎవరు గొప్ప.?
ఒకరు గొప్ప.. ఇంకొకరు తక్కువ.. అనడానికి వీల్లేదు.! క్రికెట్‌కి సంబంధించి అన్నీ కలిసి రావాలి.! విరాట్ కోహ్లీకి కాలం కలిసొచ్చింది. గౌతమ్ గంభీర్‌కి కాలం కలిసి రాలేదు.! అంతే తేడా.!
మైదానంలో ఆటగాళ్ళ మధ్య ఆవేశకావేశాలు.. అక్కడితోనే సమసిపోవాలి.!
క్రికెట్ అంటేనే జెంటిల్మెన్ గేమ్.! దురదృష్టం.. ఇప్పుడది వీధిపోరాటం స్థాయికి వెళ్ళిపోయిందేమో.. అనిపిస్తోంది.!
విరాట్ కోహ్లీ.. గౌతమ్ గంభీర్.. ఇద్దరూ టీమిండియా తరఫున అత్యద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినోళ్ళే.!
ఎందుకీ మైదానం అవతల పంచాయితీలు.? అభిమానులెందుకు చూపుతున్నారీ అత్యుత్సాహం.?
Mudra369
అందివచ్చిన అవకాశాల్ని విరాట్ కోహ్లీ (Virat Kohli) సద్వినియోగం చేసుకున్నాడు. కొన్ని అద్భుతమైన అవకాశాల్ని గౌతమ్ గంభీర్ దుర్వినియోగం చేశాడు.
ఒంటి చేత్తో టీమిండియాకి విజయాలు అందించాడు గౌతమ్ గంభీర్. విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఈ విషయంలో.!
అభిమానులెందుకు కొట్టుకుంటున్నారు.?
క్రికెట్‌లో ఉన్నత శిఖరాలు అందుకుంటే సరిపోదు.. హుందాతనం కూడా ప్రదర్శించాలి. అటు గౌతమ్ గంభీర్ కావొచ్చు.. ఇటు విరాట్ కోహ్లీ కావొచ్చు.. ఇద్దరూ హుందాతనం కోల్పోతున్నారు.

ఐపీఎల్ సందర్భంగా ఇరువురూ సగటు క్రికెట్ అభిమానిని రెచ్చగొడుతున్నారు. దాంతో, అభిమానులు గ్రూపులుగా విడిపోయి.. ‘ఎవరు తోపు.?’ అన్న విషయమై డిస్కషన్లు పెట్టే పరిస్థితి వచ్చింది.
Also Read: Dimple Hayathi.. ‘వల్గారిటీ’ అనగానే పాపకి కోపమొచ్చింది.!
సోషల్ మీడియా వేదికగానూ గంభీర్ (Gautam Gambhir), కోహ్లీ (Virat Kohli) కవ్వింపు చర్యలకు దిగడం ఆహ్వానించదగ్గ పరిణామం అయితే కాదు.!