కెరీర్‌లో తానూ కుంగుబాటుకి గురైన సందర్భాలున్నాయని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విరాట్ కోహ్లీ Virat Kohli King Of Attitude, ఆ సమయంలో తనను తాను చాలా దృఢంగా మలచుకునేందుకు ప్రయత్నించానన్నాడు. అదీ నిజమే. విమర్శలకు విరాట్ నుంచి వచ్చే సమాధానం అంత స్ట్రాంగ్‌గా వుంటుంది మరి.
విమర్శలకు మాత్రమే కాదు, వివాదాల్లోకి లాగేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే, చాలా తెలివిగా ‘బ్యాటింగ్’ చేసేస్తాడు కింగ్ కోహ్లీ (Virat Kohli King Of Attitude). స్వదేశంలో ఇంకో టెస్టు విక్టరీ సాధిస్తే, ధోనీ రికార్డుని బద్దలుగొట్టేయగలుగుతాడు విరాట్ కోహ్లీ.
ఇదే విషయాన్ని విరాట్ వద్ద ప్రస్తావిస్తే, ‘అది నిరంతర ప్రక్రియ. ధోనీ (MS Dhoni) ఘనతను నేను దాటేస్తాననడం సబబు కాదు. నేను సాధించే విజయాల్ని ఇంకొకరు అధిగమిస్తారు, అధిగమించాలి కూడా..’ అని చెప్పాడు కోహ్లీ.
అంతే కాదు, ‘ధోనీ నాకు అన్న లాంటివాడు. నేను కెప్టెన్‌గా వున్నప్పుడూ ధోనీతో (Mahendra Singh Dhoni) అలాగే వున్నాను.. ధోనీ కెప్టెన్‌గా వున్నప్పుడూ నన్ను తమ్ముడిలానే చూసుకున్నాడు..’ అని విరాట్ చెప్పాడు.
సాధారణంగా విరాట్ కోహ్లీ (Virat Kohli King Of Attitude), తన మీద వచ్చే విమర్శలకు మైదానంలో తన ఆటతీరుతో సమాధానమిస్తుంటాడు. అందుకే, విమర్శకులు కావొచ్చు, విశ్లేషకులు కావొచ్చు.. పరోక్షంగా విరాట్ కోహ్లీని కెలుకుతుంటారు. దానికి విరాట్ నుంచి తనదైన స్టయిల్లో సమాధానాలొస్తుంటాయి.
విరాట్ కోహ్లీ (Virat Kohli) అంటేనే అంత. కెరీర్‌లో చాలా ఎత్తుపల్లాల్ని చవిచూసేసిన ఈ క్రికెటర్ పరిస్థితులకు తగ్గట్టుగా తనను తాను మార్చుకోవడం బాగానే నేర్చుకున్నాడు. మాటలొక్కటే సరిపోదు, చేతలు కూడా అవసరం. ఈ విషయంలో విరాట్ కోహ్లీ సమ్‌థింగ్ స్పెషల్ అంతే.
అయితే, విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premiere League) విషయంలో మాత్రం కొంత అసంతృప్తితో వున్నాడు. తన స్థాయికి తగ్గ ప్రదర్శన గత కొన్ని సీజన్లలో (IPL Royal Challengers Bengaluru) విరాట్ చూపించలేకపోయాడు. తదుపరి సీజన్ మాత్రం తనకు చాలా చాలా ప్రత్యేకమంటున్నాడు విరాట్ కోహ్లీ.
టీమిండియా (Team India) జట్టుని కెప్టెన్‌గా విజయాల బాటలో నడిపించగలుగుతున్న కోహ్లీ, ఐపీఎల్‌లో మాత్రం, తడబడుతుండడం ఆశ్చర్యకరం. ఆ ఒక్క లోటునీ వచ్చే సీజన్‌లో (IPL T20) రాణించడం ద్వారా భర్తీ చేస్తాడేమో చూడాలి.