Virat Kohli Century.. సంక్రాంతి అంటే కొందరికి కోడి పందాలు ‘కిక్కు’ ఇస్తాయ్.! కొందరికేమో సినిమాలు కిక్కు ఇస్తాయ్.! విరాట్ కోహ్లీకి మాత్రం సెంచరీలు ‘కిక్కు’ ఇస్తాయ్.!
కాదు కాదు, కింగ్ కోహ్లీనే సెంచరీలతో అభిమానులకు సంక్రాంతి ‘కిక్కు’ ఇస్తుంటాడు. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంటాడు.
కింగ్ కోహ్లీ సంక్రాంతి సెంచరీల జాతర.! ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగు.! అందులో మూడు సెంచరీలు.. వరుసగా మూడేళ్ళలో.! ఆ మూడింటిలో ఒకటి టెస్టు సెంచరీ కాగా, రెండు వన్డే సెంచరీలు. నాలుగో సెంచరీకి.. మధ్యలో మూడేళ్ళు సంక్రాంతి సెలవులు తీసుకున్నట్టున్నాడు విరాట్ కోహ్లీ..
Mudra369
ఇప్పటిదాకా సంక్రాంతి సీజన్‌లో మొత్తం నాలుగు సెంచరీలు కొట్టాడు. 2017లో విరాట్ కోహ్లీ మొదలెట్టాడు ఈ సంక్రాంతి సెంచరీల ట్రెండ్.!
Virat Kohli Century.. వరుసగా మూడు సంక్రాంతి సెంచరీలు
2017లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్‌లో జనవరి 15వ తేదీన సెంచరీ కొట్టాడు విరాట్ కోహ్లీ. 122 పరుగులు చేశాడు ఆ మ్యాచ్‌లో. టీమిండియా ఘనవిజయాన్ని అందుకుంది.

2018లో మళ్ళీ జనవరి 15వ తేదీనే 153 పరుగులు చేశాడు. అయితే, అది టెస్ట్ మ్యాచ్. దురదృష్టం టీమిండియా ఓడిపోయింది.
మూడో సంక్రాంతి సెంచరీ ఆస్ట్రేలియా మీద.. వన్డే మ్యాచ్ సందర్భంగా సాధించాడు. 104 పరుగులతో టీమిండియాని గెలిపించాడు కోహ్లీ.
ఆ తర్వాత మొహమాటపడ్డాడుగానీ..
2020, 2021 అలాగే 2022 సంక్రాంతి సీజన్లలో టీమిండియా ఎలాంటి మ్యాచ్‌లు ఆడలేదు. 2021లో ఆడిందిగానీ, ఆ జట్టలో కోహ్లీ లేకపోవడంతో.. ఆ ఏడాది కూడా ‘కింగ్’ సంక్రాంతి సెంచరీ మిస్ అయ్యింది.
Also Read: గోల్డెన్ గ్లోబ్: ‘నాటు’గా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కొనేసిందా.?
2023లో.. అంటే, ఈ సంక్రాంతికి.. భారత క్రికెట్ అభిమానులకి గిఫ్ట్ ఇచ్చాడు. 166 పరుగులు చేశాడు.. అదీ శ్రీలంక జట్టు మీద.
మొత్తమ్మీద, ఇదో ట్రాక్ రికార్డ్ అన్నమాట. ఈ రికార్డుని ఎవరైనా తిరగరాసే ఛాన్స్ వుందా.?